Senior Actor Narasimharaju : నాగేశ్వరావు గారిని చూసి నెను అలానే ఉంటాను సినిమాలలోకి వెళితే బాగుంటుందనే ఆలోచనతో చదువు మధ్యలో వదిలేసి మద్రాస్ కు అవకాశాలకోసం వెళ్లిన నరసింహారావు రాజు గారు తెలుగులో జానపద హీరోగా బాగా గుర్తింపు తెచ్చుకున్నారు . 1970 లలో అనేక జానపద సినిమాలలో నటించిన ఆయన విఠలాచార్య సినిమా ‘జగన్మోహిని’ ద్వారా సూపర్ హిట్ అందుకున్నారు. అప్పట్లో నరసింహ రాజు, హీరోయిన్ ప్రభ హిట్ పెయిర్ గా నిలిచారు. ‘నీడలేని ఆడది’ వంటి సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన నరసింహ రాజు గారు, విఠలాచర్య గారి పరిచయంతో ఆయన కెరీర్ మారిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా వడ్లమూరు గ్రామానికి చెందిన నరసింహరాజు గారు దాదాపు గా 110 సినిమాల్లో నటించారు.

పిలిచి అవకాశం ఇస్తే చేయనని అక్కడే చెప్పేసాను…
1985 తరువాత సినిమాల్లో అవకాశాలు తగ్గి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన నరసింహారాజు గారు అటు సీరియల్స్ లో కూడా బాగా నటించేవారు. తమిళం చాలా సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నరసింహారాజు గారు తెలుగులో కృష్ణవంశీ గారి ‘సింధూరం’ సినిమాలో నక్సలైట్ పాత్రలో నటించారు. ఇక మళ్ళీ కృష్ణ వంశీగారి సినిమా ‘మురారి’ లో మహేష్ బాబు గారి పెద్దన్నయ్య క్యారెక్టర్ లో నటించడానికి అడిగితే నర్సింహారాజు గారు చేయనని చెప్పేసారట.

లక్ష్మి గారి పక్కన ఆమె భర్త గా సరిపోనని సన్నగా అంత ఎత్తుగా ఏమీ ఉండక పోవడం వల్ల ఆమె భర్తగా బాగోనని అదీకాక కైకాల సత్యనారాయణ గారు భారీగా ఉంటారు ఆయన కొడుకుగా నేను బాగోనని ఇంకెవరినైనా ట్రై చేయండి అని చెబితే నిజమే మీరు అంటుంటే ఇప్పుడు నాకు అలానే అనిపిస్తోంది అంటూ కృష్ణ వంశీ అన్నారంట. ఇక మరో సినిమాలో కూడా ఇలానే డైరెక్టర్ పాత్ర చెప్పాక నేను నప్పనని చెప్పాను, నాకు అనిపిస్తే అక్కడే చెప్పేస్తా వాళ్ళివ్వరు కదా అని చేస్తే స్క్రీన్ మీద తెలిసిపోతుంది కదా ఆ పాత్రకు సరిపోయామా లేదా అని అంటూ అందుకే చాలా సినిమాల్లో చేయలేదంటూ చెప్పారు.

































