Senior Actor Naresh : ఈ మధ్య కాలంలో ఏదైనా సెలబ్రిటి జంట బాగా ఫేమస్ అయ్యారు అంటే అది నరేష్, పవిత్ర లోకేష్. వీళ్ళిద్దరు, ప్రేమలో ఉన్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ జోరుగా వినిపించింది. అందుకు తగ్గట్టే చెట్టా పట్టాలేసుకుని ఇద్దరు తెగ తిరిగారు. ఇక వీళ్ళ పెళ్లిళ్ల సంఖ్య చూసి జనాలకు కూడా వీళ్ళ ఇష్యూ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. అటు పవిత్ర లోకేష్ కు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక ఇటు నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకుని ఇపుడు నాలుగో పెళ్ళికి సిద్ధమయ్యాడు. దీంతో నరేష్ మరింత ఫేమస్ అయ్యాడు. ఒక వైపు వీళ్ళుప్రేమ పావురాల్లాగా తిరుగుతుంటే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మీడియా ముందుకు వచ్చి నానా రచ్చ చేసింది. ఇంకా నాతో విడాకులు తీసుకోకుండానే వీళ్ళు ఎలా కలిసి ఉంటారు అంటూ వీళ్ళను రచ్చకీడ్చింది. ఈ ఇష్యూ అంత తెగ వైరల్ అయి ఈ మధ్యనే సైలెంట్ అవ్వగానే తాజాగా మళ్ళీ పెళ్లి అంటూ నరేష్ ,పవిత్ర లోకేష్ సినిమా చేసారు.

మా ప్రేమ అలా మొదలయింది…..
నరేష్ పవిత్ర లోకేష్ ఈ ఇద్దరి ప్రేమ వ్యవహారం గురించి కొత్తగా తెలుగు ప్రేక్షకులకు చెప్పకర్లేదు. అయితే తాజాగా వేరే వారి ప్రేమకతను సినిమాగా తీసి మళ్ళీ పెళ్లి అంటూ విడుదల చేసారు. ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న వీళ్ళు వాళ్ళ ప్రేమకథ గురించి తొలిసారి మాట్లాడారు. కోనేళ్ల క్రితం సినిమా షూటింగ్ లో తనని చూసినా అసలు మాట్లాడేది కాదు సైలెంట్ గా ఉండటం చూసి పొగరేమో అనుకున్న అంటూ నరేష్ తెలిపారు. ఇక సమ్మోహనము సినిమా టైం కి మా మధ్య పరిచయం పెరిగిందని మెసెజెస్ చేసుకునేంత ఫ్రెండ్షిప్ వచ్చిందంటూ చెప్పారు. ఇక సమ్మోహనం సినిమా టైం లో తనకి ప్రపోజ్ చేసానని తన లైఫ్ గురించి నా లైఫ్ గురించి తనకు అన్నివిషయాలు తెలియడం వల్ల నేను ధైర్యంగా చెప్పగాలిగాను అంటూ చెప్పారు.

ఇక పవిత్ర మాత్రం ప్రపోజ్ చేస్తే ఒక్క మాట చెప్పకుండా వెళ్ళిపోయిందని ఆ రోజు నిద్రపట్టలేదంటూ చెప్పారు. ఇక ఆ ఇయర్చివరి రోజున నీ సమాధానం ఏమిటో చెప్పు అని అడిగే సరికి చెబుతా అంటూ సాయంత్రం తన ప్రేమను చెప్పేసింది. ఇక తనలో మా అమ్మను చుసుకున్నాను తను చాలా బాగా వండుతుంది. అందుకే నేను ఎక్కువ కనెక్ట్ అయ్యానని చెప్పారు. ఇక పవిత్ర మాట్లాడుతూ తనని ఎందుకు ఇష్టపడుతున్నది ఇప్పటికీ తనకి చెప్పలేదని అది నాకు తెలియదని చెప్పారు.