వాణిశ్రీ అంటే నేటి తరం సినీ ప్రేక్షకులకు తెలియకపోవచు కానీ.. నాటి తరం సినిమా ప్రేక్షకుల గుండెల్లో మర్చిపోలేని స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఆమె ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వాణిశ్రీ కుమారుడు అభినయ్ వెంకటేష్ (36) గుండెపోటుతో మరణించారు. తన నివాసంలో నిద్రిస్తున్న సమయంలోనే గుండెపోటుతో అయన కన్నుమూసినట్టు సమాచారం.

చెన్నై లోని అన్నపూర్ణ మెడికల్ కళాశాలలో డాక్టర్ గా పని చేస్తున్నారు అభినయ్ వెంకటేష్. అభినయ్ భార్య కూడా డాక్టర్ గానే పనిచేస్తున్నారు. ఆయనకు నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే కుమారుడి అకాల మరణంతో వాణిశ్రీ ఇంట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈనేపధ్యంలో వాణిశ్రీ కి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు సినీ ప్రముఖులు..




























