Senior Actor Varalakshmi : రేప్ ల వరలక్ష్మి అని పిలిపించుకోవడం బాగుండదు.. పబ్లిక్ లో అలా పిలవడం నాకు కోపం తెప్పించేది. : వరలక్ష్మి

0
83

Senior Actor Varalakshmi : వరలక్ష్మి బహుభాషా నటి, ఆమె అన్ని దక్షిణ భారతీయ భాషలలో మరియు హిందీలో నటించింది. ఈమె ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టి పెరిగి చెన్నైలో స్థిరపడింది. వరలక్ష్మి బిజీ షెడ్యూల్ వల్ల పదో తరగతి తర్వాత చదువు కొనసాగించలేకపోయింది. ఆమెకు వైద్యుడితో వివాహం మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ఆమె తమిళంలో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది.సపోర్టింగ్ రోల్స్‌లో తన సహజ నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగింది. వరలక్ష్మి తండ్రి కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించారు. ఆమె సోదరీమణులు, “రాణి” మరియు సరస్వతి కూడా కళాకారులే. 

రాణిని అలైగల్ రాణి అని పిలుస్తారు మరియు ఆమె ప్రతికూల పాత్రలతో సహా పలు పాత్రలు చేస్తూ తమిళంలో అత్యుత్తమ టీవీ నటీమణులలో ఒకరు. ఒక సినిమాలో తన నటనకు గాను రాణి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మకమైన నంది అవార్డును కూడా కైవసం చేసుకుంది. రాణి వరలక్ష్మిని మరొక తల్లిగా మరియు కొన్నిసార్లు వారి కుటుంబాన్ని బాగా చూసుకునే మరొక తండ్రిగా భావించింది. తెలుగులో పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణ వరలక్ష్మికి బంధువు. వరలక్ష్మి తన కాలంలోని వివిధ భాషలలో దాదాపు అందరు ప్రధాన హీరోలతో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంది. ఆమె తెలుగు హీరోలకు సోదరిగా నటించింది. చిరంజీవి, నాగార్జున,వెంకటేష్ మరియు బాలకృష్ణ లాంటి హీరోల చిత్రాల్లో తరచుగా చెల్లెలి పాత్రలో కనిపించేది.

‘అందాలు రాముడు’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వరలక్ష్మి తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఆనాటి సూపర్ హిట్ చిత్రం’ శంకరాభరణం’ బహుముఖ దర్శకుడు కే విశ్వనాథ్ దర్శకత్వంలో వరలక్ష్మి చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు. దాదాపు 100 సినిమాలు మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా 100+ సినిమాల్లో నటించింది.మోహన్‌బాబుతో ‘చిట్టెమ్మ మొగుడు’ చిత్రంలో వరలక్ష్మి కీలక పాత్ర పోషించింది. దివ్య భారతి1992లో.. ఒక ఇంటర్వ్యూలో వరలక్ష్మి తన ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్ అని దివ్యభారతి చెప్పింది. ఎస్వీ రంగారావు అతను సహజ నటుడని, లేటెస్ట్ హీరోలంటే తనకు చాలా ఇష్టమని, అయితే తనకు మొదటి ఫేవరెట్ రంగారావు అని పేర్కొంది. వరలక్ష్మి “శ్రీదేవినే స్ఫూర్తిగా తీసుకుంటుంది.

టీవీ సీరియల్ యుగం ప్రారంభమైన తర్వాత, ఆమె మినీ స్క్రీన్ పరిశ్రమలోకి ప్రవేశించి, ప్రతినాయకురాలితో సహా వివిధ రకాల పాత్రలను పోషించింది. ఆమె ఆ పాత్రలకు ప్రసిద్ధి చెందింది.అష్టా చమ్మా మా టీవీలో ప్రసారమైన తెలుగు సీరియల్ వరలక్ష్మికి మంచి పేరు తీసుకువచ్చింది. అయితే ఆమె ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. రేపుల వరలక్ష్మి అని మిమ్మల్ని పిలుస్తుంటారు. అలా పిలవడం పట్ల మీ అభిప్రాయం ఏమిటి? అని యాంకర్ అడగగా.. తనను రేపుల వరలక్ష్మి అని పిలవడం అసహ్యంగా ఉంటుందని అప్పట్లో నేను హీరో చెల్లెలి పాత్ర చేయడంతో.. విలన్ గ్యాంగ్ హీరో చెల్లెల్ని ఎత్తుకెళ్లి రేప్ చేయడం ఉండేది. ఆ తర్వాత సినిమా సక్సెస్ ఫంక్షన్ లో ఒక యాక్టర్ రేప్ ల వరలక్ష్మి అని పిలవడం జరిగింది. అలా పిలవడం నాకు ససేమిరా ఇష్టం ఉండదు. అలా పిలిచే బదులు సిస్టర్ వరలక్ష్మి అని పిలవండని చెప్పాను. సినిమాలో పాత్ర అలా ఉన్నప్పటికీ పబ్లిక్ లో అలా పిలవడం బాగుండదు. అలాగే సినిమా పత్రికల వారు అప్పట్లో అలా రాయడం నాకు నచ్చలేదని ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నిజంగానే ఇకనుంచి ఆమెను సిస్టర్ వరలక్ష్మి అని పిలుద్ధాం.అలాగే తిరిగి ఆమె సినిమాలలో నటించాలని కోరుకుందాం.