సీనియర్ నటి యమున తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. 1987లో యమున హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్ లో ఆమె 1989లో మౌన పోరాటం చిత్రంలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. యమున తన సినీ జ్ణాపకాలను గుర్తు చేసుకుంటూ ఈమధ్యనే ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు.

ఆ ఇంటర్వ్యూలో ఆమె “మౌన పోరాటం” మూవీకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడైతే వెండి తెరపై ఎక్స్ పోజింగ్, లిప్ లాక్ లు అనేవి సాధారణంగా మారిపోయాయి. కానీ నేను ఇండ్రస్ట్రీకొచ్చిన క్రొత్తలో అలా కాదు. కాస్త ఎక్స్ పోజింగ్ చేయాలన్నా హీరోయిన్లు చాలా ఆలోచించేవాళ్ళు. సరిగ్గా నాకు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. అది కూడా తొలి చిత్రంతోనే అని యమున తెలిపింది. మౌన పోరాటం చిత్రంలో యమున బికినిలో కూడా కనిపించింది. కొన్ని ఇంటిమేట్ సన్నివేశాలు ఉన్నాయి. అప్పట్లో ఎక్స్ పోజింగ్ చేయాలంటే కథ డిమాండ్ చేయాలి. ఆ సన్నివేశానికి అందంగా కనిపించడం అవసరమై ఉండాలి. లేకపోతే హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ కు నో చెప్పేవాళ్ళు అని యమునా తెలిపింది. 

మౌన పోరాటం చిత్రంలో ఎక్స్ పోజింగ్ అవసరం. నేను మోసపోయే అమ్మాయి పాత్రలో నటించాలి. అలాంటప్పుడు ఎక్స్ పోజింగ్ అవసరం. నేను చేయాలా వద్దా అని డైలమాలో ఉన్నా. పాపం డైరెక్టర్ గారు నాకు వివరించారు. నేను ఎక్స్ పోజింగ్ చేయకపోతే సినిమా సరిగా ఆడదు. ఆ కథ అలాంటిది అని యమున తెలిపింది. కొన్ని సినిమాల్లో అనవసరంగా ఎక్స్ పోజింగ్ చేసినట్లు కూడా యమునా పేర్కొంది. కానీ అప్పట్లో ధైర్యం చేసి దర్శకులతో చెప్పలేకపోయేవాళ్ళం. సినిమా పూర్తయ్యాక ఆ సన్నివేశం లో ఎక్స్ పోజింగ్ అవసరం లేదు కదా అని అనిపించేది. యమున తెలుగులో ఘటన, మామగారు లాంటి ఎన్నో చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె బుల్లితెరపై నటిగా రాణిస్తోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here