Senior actress Jayachithra : సోగ్గాడు సినిమాలో హీరోయిన్ గా శోభన్ బాబుకి జోడిగా నటించిన జయచిత్ర ఆ తరువాత తెలుగులో బిజీ హీరోయిన్ గా మారి పోయింది. దాదాపు 200 సినిమాల్లకు పైగా నటించిన జయచిత్ర తమిళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలు పెట్టి ఆ పై చదువుకుంటూనే హీరోయిన్ గా కూడా చేశారు. మురళి మోహన్ జయచిత్ర అలాగే శోభన్ బాబు తో హిట్ పెయిర్ గా నిలిచిన జయచిత్ర అసలు పేరు లక్ష్మి కృష్ణవేణి రోహిణి పార్వతి. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో గయ్యాళి అత్త పాత్రలో నటించిన జయచిత్ర గారు అటు సీరియల్స్ లోనూ నటించిన ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు.

బాహుబలిలో అవకాశం అలా పోయింది…
తాజాగా జయచిత్ర గారు ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో రాజమాతగా నటించి మెప్పించారు. అయితే ఆ సినిమాతో చిన్నప్పపటి నుండి అనుబంధం ఉంది అంటూ తెలిపిన ఆమె చిన్న వయసులో చదువుకునే రోజుల్లోనే ఆ నవల గురించి టీచర్ చెప్పి అందులో కుందవి పాత్ర నువ్వు చేయాలి అని చెప్పారట. హీరోయిన్స్ గా ఉన్నపుడు ఆ నవలను సినిమాగా తీయాలనే ఆలోచనతో ఒక డైరెక్టర్ నందిని పాత్రను జయచిత్ర గారికి ఇచ్చినా సినిమా మధ్యలో ఆగిపోయింది అది కుదరలేదు.

అయితే చివరికి ఇప్పుడు ఆ సినిమాలో ఒక పాత్రను జయచిత్ర గారు చేసారు. ఇక తెలుగు సినిమా గురించి మాట్లాడుతూ రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో ఒక సీరియల్ లో నటించాల్సి ఉండగా మధ్యలో ఇద్దరు రాజులూ వచ్చి చెడగొట్టి నాకు రాఘవేంద్ర రావు గారికి మధ్య గ్యాప్ వచ్చేలా చేసారు. అలా నేను ఆ సీరియల్ లో అవకాశం కోల్పోయాను అదే కనుక చేసుంటే రాజమౌళి తో పనిచేసే అవకాశం వచ్చుండేది, అలా బాహుబలి లో నేనే రాజమాతగా చేసుండేదాన్నేమో అనిపిస్తుంది, అంతా ఆ ఇద్దరు రాజుల వల్లే అంటూ తెలిపారు.



































