Senior Actress Kavitha : పదకొండేళ్ళకే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్ గాను అలాగే సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఇటు రాజకీయాల్లోను ఉన్న కవిత గారు తన సినిమా కెరీర్ లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. కవిత గారు తమిళ ఇండస్ట్రీలో మొదలు పెట్టి తెలుగులోను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఆ తరువాత హీరోయిన్ గా అడుగుపెట్టారు. సినిమాల్లో నటిస్తున్న సమయంలో సీనియర్ జూనియర్ అంటూ తాను ఎదుర్కొన్న ర్యాగింగ్ గురించి తాజాగా యూట్యూబ్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

జయచిత్ర చాలా అవమానించింది…
మొదట్లో నటించే సమయంలో హీరోయిన్ జయచిత్ర గారి కాంబినేషన్ లో సినిమాలను చేసిన సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను కవిత పంచుకున్నారు. ఆవిడ సీనియర్ అవ్వడం వల్ల ఆవిడ ముందు కూర్చో కూడదని, ఒకవేళ మనం కూర్చున్న చోటికి ఆవిడ వస్తే వెంటనే లేచి నిలబడాలని కండిషన్స్ పెట్టేదని చెప్పారు. ఇంకెవరితోనూ ఇలాంటి ఇబ్బందులు లేవని కేవలం జయచిత్ర గారు అలా చేసేవారంటూ చెప్పింది. ఇక బాగా మాట్లాడుతూ అందరితో నవ్వుతూ అల్లరి చేసేదాన్ని ఒకేవల సెట్ లో ఆమె ఉంటే పిలిచి నీ వాయిస్ నాకు వినిపించరాదు, అలా అరవకు అని గట్టిగా చెప్పేవారు అంటూ కవిత ఆమెతో ఉన్న అనుభవాలను పంచుకున్నారు.

అయితే ఇలా మొదట్లో జరిగినా తరువాత రోజుల్లో ఒక తమిళ సినిమాలో ఇద్దరూ కలిసి నటిస్తున్న సమయంలో కంటిన్యూ గా సీన్ లో ఒకే చీర కట్టుకున్న కవిత గారిని అదే రంగు చీర కట్టుకున్న జయచిత్ర గారు మార్చమని చెప్పారట. అలా కుదరదు ఆల్రడీ సీన్స్ కొన్ని ఆ చీరలో షూట్ చేసాం అని చెప్పినా వాదించారట. ఇక కవిత గారిని చిటికేసి అది ఇది అంటూ తమిళ భాషలో అనే సరికి కోపం వచ్చి ఆ రోజులు పోయాయి నువ్వు సీనియర్ అయితే ఏంటి అంటూ కవిత గారు గొడవ పెట్టుకోవడంతో షూటింగ్ ఆగిపోయింది. ఎంత సర్ది చెప్పినా ఆమె గొడవ పెట్టుకోవడం వల్ల ఏడాది షూటింగ్ ఆగిపోయింది అంటూ కవిత గారు అప్పటి అనుభవాలను చెప్పారు.


































