Senior Actress KR Vijaya : దేవత పాత్రలు అనగానే ఒక్కప్పటి సినిమాల్లో గుర్తు వచ్చేది కేఆర్ విజయ గారు. ఆమె పెద్ధ కళ్ళు అందమైన ముఖ వర్చస్సు వల్ల అమ్మవారి రూపంలో చక్కగా కనిపించేవారు. ఇక హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. తెలుగులో మొదటగా ‘శ్రీకృష్ణ పాండవీయం’ సినిమాతో గుర్తింవు తెచ్చుకున్న ఆమె తమిళంలో తన కెరీర్ మొదలు పెట్టారు. ఇక కేరళ కు చెందిన ఈమె తండ్రిది మాత్రం చిత్తూరు జిల్లా కావడం విశేషం. ఇక తెలుగులో వందకు పైగా సినిమాలలో నటించిన విజయగారు ఎక్కువగా తమిళంలోనూ ఆపైన తెలుగు, మలయాళంలో నటించారు. ఆమె వ్యక్తిగత విషయాలను అలాగే కెరీర్ గురించి ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

భర్త మరణం బాధించింది…
సినిమాల్లోకి తమిళ సినిమా ‘కర్పగం’ తో ఎంట్రీ ఇచ్చిన విజయ గారు అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక హీరోయిన్ గా కొనసాగుతూనే వేలాయుధం గారిని పెళ్లి చేసుకున్నారు. ఇక విజయ గారి మొత్తం కాల్షీట్స్ ఆమె భర్తే చూసుకునేవారట. షూటింగ్స్ ఎక్కడ ఏ కారులో వెళ్ళాలి దగ్గరి నుండి మొత్తం విజయ గారికి సంబంధించిన విషయాలు ఆయనే చూసేవారట.

ఇక డబ్బుకు సంబందించిన విషయాలను కూడా ఆయనే చూసేవారని విజయ తెలిపారు. ఆయన నన్ను మహారాణి లాగా చుకునేవారని అయితే ఆయన మరణం తరువాతే ఆయన నాలో ఎంత కలిసిపోయారో అర్థమైందని అంతవరకు తెలియలేదని వివరించారు. ఆయన మరణించాక బయటికి వెళ్లాలన్నా ఒంటరిగా కొంత భయంగానే ఉంటుందని వివరించారు.



























