అలనాటి ప్రముఖ స్టార్ హీరోయిన్ మీనా ఇండస్ట్రీకి బాలనటిగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకొని అనతికాలంలోనే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి దశాబ్దకాలం పాటు సౌత్ ఇండియాలో అగ్ర కథానాయిక వెలుగొంది పలు ప్రశంశలను అందుకుంది. మీనా ,విక్టరీ వెంకటేష్ జంటగా నటించిన దృశ్యం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం అందరికి తెలిసిందే. మరోసారి దృశ్యం 2 సినిమాతో మీనా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

హీరోయిన్ మీనా కొంతకాలంగా ప్రతీ గురువారం త్రో బ్యాక్ ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే తాజాగా మీనా రోజాతో కలిసి దిగిన ఓ అరుదైన ఫొటోను ప్రేక్షకులతో పంచుకుంది. అలనాటి ఇద్దరు స్టార్ హీరోయిన్స్ కలిసి ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
బాగా పాపులర్ అయిన ఈ ఫోటో మీనా అల్లరి ప్రియుడు సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న సమయంలో అక్కడే షూటింగ్ జరుపుకుంటోన్న ముగ్గురు మొనగాళ్లు సినిమా సెట్‌లో రోజా ఉండగా ఓ సందర్భంలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో కావడం విశేషం. వీరిద్దరూ మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే.అలాగే ఇద్దరు కలిసి ముఠామేస్త్రీ, బొబ్బిలి సింహం వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.





























