Senior Actress Radha : అప్పుడు చిరంజీవి అలా చేశాక.. నేను ఒక గూండాల తయారు కావాలనుకున్నాను. : రాధ

0
119

Senior Actress Radha : రాధగా తన సినీ పేరుతో చలనచిత్రరంగంలో 80వ దశకములోని ప్రసిద్ధి చెందిన రాధ దక్షిణాది భాషలలో 250కు పైగా సినిమాలలో నటించింది.ఈమె అక్క అంబిక కూడా సినిమా నటి. ఈమె
క్రియాశీల సంవత్సరాలు1981 – 1991. రాధ, 1980వ దశకములో అగ్రతారగా ఎదిగి ఆనాటి దక్షిణ భారత సినిమా రంగములోని అగ్ర నటులందరితో కలసి నటించింది.

ఈమె తన నటనా జీవితపు తారాస్థాయిలో ఉండగా.. తన బంధువైన మణి అనే బొంబాయికి చెందిన వ్యాపారవేత్తను వివాహమాడి అక్కడ స్థిరపడినది. పెళ్ళి తర్వాత రాధ సినిమాలకు స్వస్తి చెప్పి బొంబాయిలో ప్రస్తుతం ఒక రెస్టారెంటును నిర్వహిస్తున్నది. ముగ్గురు పిల్లలకు తల్లైన రాధ 30 సంవత్సరాలు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఆ క్రమంలో వ్యాపారాలు పిల్లలతో నిమగ్నమైన రాధా ఇప్పుడు ఒక్కసారిగా బుల్లితెరవైపు మొగ్గు చూపారు. ఈ మధ్యకాలంలో మా టీవిలో ప్రసారమవుతున్న ‘బీబీజోడీ’ అనే కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం మధ్యలో ఆనాటి సినిమాలు హీరోలతో జరిగిన తీపి జ్ఞాపకాలను ఆమె గుర్తు చేసుకోవడం ఓ విశేషం. మాటీవీలో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది.

అయితే తాజాగా ఒక వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధ మాట్లాడుతూ…తాను మలయాళిని అయినప్పటికీ తెలుగు ప్రజలు నన్ను ఎంతగానో గుర్తు పెట్టుకున్నారు. తెలుగు ప్రజలందరికీ రుణపడి ఉంటాను. తెలుగు సినీ పరిశ్రమలోకి ఎలా అడుగుపెట్టారు అని యాంకర్ అడుగగా.. తెలుగులో శోభన్ బాబు హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విడుదలైన “మిస్టర్ విజయ్” చిత్రంలో గెస్ట్ రోల్ కనిపించాను. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలోనే వచ్చిన “ప్రేమమూర్తులు” సినిమాలో శోభన్ బాబు సరసన హీరోయిన్ గా నటించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత అక్కినేని, ఎన్టీ రామారావు, కృష్ణ వంటి సీనియర్ నటులతో నటించాను. ఆ తర్వాత అప్పటి యూత్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలతో కూడా నటించడం జరిగింది.

1980 నాటి హీరో, హీరోయిన్స్ అంతా ప్రతిసారి ‘రీ యూనియన్’ అవుతూ ఉంటారు. అక్కడ మీ బ్యాచ్ వారంతా ఏం చేస్తుంటారని యాంకర్ అడగగా.. మేమంతా స్టార్ ఇమేజ్ పక్కనపెట్టి ఎలాంటి ఇగోలు లేకుండా డే మొత్తం స్పెండ్ చేస్తాం. నేను ఎక్కువగా సుహాసినితో నా ఫీలింగ్స్ షేర్ చేసుకుంటాను. అయితే చిరంజీవితో మీకున్న ఆనాటి తీపి జ్ఞాపకాలు చెప్పండని యాంకర్ అడగగా.. నేను చిరంజీవి గారితో మొదటిసారిగా ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన “గూండా” చిత్రంలో హీరోయిన్ గా నటించాను. అప్పటివరకు డాన్స్ బాగా చేస్తున్న నాకు ఆ చిత్రంలో చిరంజీవి డాన్స్ చూశాక నేను కూడా డాన్స్ లో గూండా లాగా తయారు కావాలనుకున్నానని రాధా చమత్కరించారు. చిరంజీవి గారితో పోటీ పడడం కాదు గాని.. డాన్స్ మాత్రం బాగా చేయాలనిపించేది. అయితే చిరంజీవితో అడవిదొంగ, కొండవీటి రాజా, స్టేట్ రౌడీ, కొండవీటిదొంగ, కొదమసింహం లాంటి చిత్రాల్లో చిరంజీవితో రాధా సరి సమానంగా డాన్స్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి-రాధా ఇద్దరిదీ ఒక బెస్ట్ పెయిర్ గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోతారు. అయితే రాధా తన సెకండ్ ఇన్నింగ్స్ లో చిరంజీవి సినిమాలో ఒక మంచి పాత్రలో కనిపించాలని మెగాస్టార్ అభిమానులు కోరుకుంటున్నారు.