Senior actress Roja Ramani : రోజా రమణి లవ్ స్టోరీ… తరుణ్ పెళ్లి ఎప్పుడంటే… ఆ బాధ తట్టుకోలేక…: సీనియర్ నటి రోజా రమణి

0
166

Senior actress Roja Ramani : తమిళనాట పుట్టి భక్త ప్రహల్లాద సినిమాతో బాల నటిగా జాతీయ ఉత్తమ బాలనటి అవార్డు అందుకున్న రోజా రమణి గారు పెద్దయ్యాక హీరోయిన్ గా, హీరోలకు చెల్లిగా అనేక సినిమాలలో నటించింది. ఇక ఒరియా నటుడైన చక్రపాణిని వివాహం చేసుకున్న రోజా రమణి గారికి తరుణ్ అలాగే అమూల్య లు సంతానం. ఇక తెలుగు ప్రజలకు హీరో తరుణ్ సుపరిచితుడే. హీరోగా ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న తరుణ్ బాలనటుడిగా కూడా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. నేషనల్ అవార్డు కూడా సొంత చేసుకున్నాడు. ఇక తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ ద్వారా రోజా రమణి గారు తన జీవిత అలాగే కెరీర్ కి సంబంధించిన విషయాలను తెలిపారు.

రోజా రమణి లవ్ స్టోరీ…

చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన రోజా రమణి గారు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించారు. ఆపైన హీరోయిన్ గా ‘కన్నె మనసులు’ వంటి సినిమాల్లో నటించారు. ఇక హీరో చెల్లెలుగా చాలా సినిమాల్లో నటించిన ఆమె సీనియర్ హీరోలందరితోనూ నటించారు. అలా పలు భాషలలో నటిస్తున్న ఆమె ఒరియా సూపర్ స్టార్ అయిన చక్రపాణి గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తన లవ్ స్టోరీ గురించి మాట్లాడారు. ఇద్దరం కలిసి దాదాపు ఐదు సినిమాల్లో నటించామని ఒరియా ఎన్టీఆర్ గా చక్రపాణిగారికి పేరుందని తెలిపారు. ఆయనతో కలిసి తెలుగు లవకుశ సినిమాను ఒరియాలో చేసానని చెప్పిన ఆమె అలా సినిమాలను చేస్తున్న సమయంలోనే ప్రేమలో పడగా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నపుడు ఇంట్లో వాళ్ళకి చెప్పగా వాళ్ళు అభ్యంతరం చెప్పకపోవడంతో పెళ్లి చేసేసుకున్నాం.

పెళ్లి అయ్యాక నటించకూడదని ఎవరూ ఇంట్లో చెప్పకపోయినా నాకే బ్రేక్ తీసుకోవాలని అనిపించింది. అలా పిల్లలు పుట్టాక ఇక వారి కోసం టైం కేటాయించాలని వద్దనుకున్నా ఆ పైన డబ్బింగ్ అవకాశాలు రావడంతో బిజీ అయ్యాను. దాదాపుగా 500 సినిమాలకు డబ్బింగ్ చెప్పుంటాను అంటూ చెప్పారు. ఇక కొడుకు తరుణ్ వెంకటేశ్వర స్వామి భక్తుడు అంటూ చెప్పారు. రోజు గంట పైన పూజ చేస్తాడని చెప్పారు. ఇక కూతురు అమూల్య నాలాగా పెద్దగా పూజలు వంటివి చేయదు కేవలం ఉదయం రాత్రి పడుకునేప్పుడు మొక్కుకుంటాం అంతే అంటూ చెప్పారు. ఇక తరుణ్ పెళ్లి జరగాల్సిన గడియలు వస్తే జరుగుతుంది. మళ్ళీ సినిమాల్లో చేయడానికి సిద్ధమవుతున్నాడు అంటూ చెప్పారు.