Senior Director Geetha Krishna : ఏపీ రాజకీయాల్లో ఒకవైపు అధికార పార్టీ మరో వైపు ప్రతిపక్ష పార్టీ రెండూ ఈసారి ఎవరు ఎన్నికల్లో గెలవాలని పోటీ పడుతుంటే జనసేన ఎటు వైపు ఉంటే విజయం ఎవరికి వస్తుంది, స్నేహం సమీకరణాలు జరుగుతున్నాయి. జనసేన టీడీపీ కలిసి వెళ్తే జగన్ కు చెక్ పెట్టొచ్చు అంటూ ఒకవైపు వినిపిస్తున్న నేపథ్యంలో జగన్ కు సన్నిహితుడైన తెలంగాణ సీఎం కెసిఆర్ పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు కు దూరంగా ఉండటానికి 1000 కోట్లు ప్యాకేజీ ఇచ్చారు అంటూ పొలిటికల్ సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ నిజమవ్వడానికి ఎంత అవకాశం ఉంది అనే విషయాన్ని డైరెక్టర్ గీతా కృష్ణ వివరించారు.

కెసిఆర్ పగ పాము లాంటిది…
చంద్రబాబు నాయుడు ఆయన సీఎం గా ఉన్నపుడు దిద్దుకోలేని తప్పు అంటే కెసిఆర్ కు మంత్రి పదవి ఇవ్వకుండా చేసారు. దానివల్ల ఆయన చాలా నష్టపోయారు. ఇక అలానే అధికారంలో ఉన్నపుడు మోడీ అడిగిన ఒక సహాయం చేయకపోవడం కూడా ఆయన చేసిన అతి పెద్ధ మిస్టేక్ అంటూ గీతా కృష్ణ అభిప్రాయపడ్డారు.

అందువల్ల అటు మోడీ ఇటు కెసిఆర్ ఇద్దరూ చంద్రబాబుకు శత్రువులుగా మారారు. వాళ్లిద్దరూ చంద్రబాబు రాజకీయంగా నాశనం చేయడానికి ఏమైనా చేస్తారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ టీడీపీ కి దూరంగా జరగడానికి 1000 కోట్లు పార్టీ ఫండ్ ఇచ్చారనే వార్తల్లో నిజం ఉండొచ్చు అంటూ గీతా కృష్ణ అభిప్రాయపడ్డారు. అందులోనూ కెసిఆర్ పగ పాము వంటిది, జన్మలో మళ్ళీ చంద్రబాబును అధికారంలోకి రానివ్వకుండా చేయడానికి ఎంతైనా చేస్తాడు. అందులోనూ 1000 కోట్ల డబ్బులు ఒక సీఎంకి అందులోనూ ఒక సౌత్ సీఎం కి పెద్ధ కష్టమేమి కాదు అంటూ గీతా కృష్ణ అభిప్రాయపడ్డారు.































