సాధారణంగా కొందరు సినిమానే జీవితంగా భావిస్తారు.అలాగే తమ నమ్ముకున్న వృత్తిని దైవ సమానంగా భావించి ఎలాంటి పరిస్థితులలో కూడా ఆ వృత్తికి అన్యాయం చేయకుండా న్యాయం చేయాలని ప్రయత్నిస్తారు.ఈ క్రమంలోనే తమ కుటుంబ సభ్యులకు ఏం జరిగినా కూడా వాటన్నింటినీ పక్కనపెట్టి సినిమా షూటింగ్లో పాల్గొంటారు.

ఇలా గతంలో ఎన్టీఆర్ తన పెద్ద కుమారుడు చనిపోతే సెట్ కి సీనియర్ ఆర్టిస్టులందరూ వచ్చారని ఆ బాధను పక్కనపెట్టి షూటింగ్లో పాల్గొన్నారు. తాజాగా 13 సంవత్సరాల క్రితం జరిగిన ఇలాంటి ఘటనను డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య బయటపెట్టారు.2008లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో శివాజీ, లయ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం ఆలయం.
ఈ సినిమా షూటింగ్ లో భాగంగా సీనియర్ నటుడు తిలక్ నటించారని అయితే ఒకరోజు తిలక్ భార్య మరణించడంతో అతను ఇంటిదగ్గర ఉండకుండా డేట్స్ అడ్జస్ట్ కావని సెట్ కి వచ్చి సినిమా షూటింగ్ లో పాల్గొన్నారని గుర్తుచేసుకున్నారు.సాధారణంగా తిలక్ ఎవరితోనూ పెద్దగా మాట్లాడరు ఆరోజు కూడా అలాగే ఉన్నారని డైరెక్టర్ తెలిపారు.
ఇక ఆ రోజు షూటింగ్ లో భాగంగా తనపై షాట్ ఓకే అయిన తర్వాత తిలక్ తన భార్య చనిపోయిందని, తన శవం ఇంట్లో ఉందని అసలు విషయం చెప్పి బోరున ఏడ్చారని ఈ సందర్భంగా డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గత 13 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గురించి తెలియజేశారు.





























