Senior Hero Suman : తెలుగు వారికి వెంకటేశ్వర స్వామి పాత్ర అంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు గుర్తొస్తే ఇప్పుడు మాత్రం సుమన్ గారే గుర్తొస్తారు. ఆయన నటించిన ‘అన్నమయ్య’ సినిమాలో వేంకటేశ్వరస్వామి పాత్రకు ప్రాణం పోశారు. తుళు కుటుంబానికి చెందిన హీరో సుమన్ మొదట తమిళ ఇండస్ట్రీలో ఓ మోస్తరు సినిమాలను చేసాక తెలుగు ఇండస్ట్రీలోకి కుడా అడుగుపెట్టారు. తెలుగులో మొదట ‘ఇద్దరు ఖిలడీలు’ సినిమాతో మొదలు పెట్టి ఆ తరువాత తరంగిని, త్రివేణి సినిమాల్లో నటించారు. అయితే తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది మాత్రం పెద్ద వంశీ గారి ‘సితార’ సినిమాతోనే. ఆ సినిమాలో సుమన్ గ్లామర్ కి అప్పట్లో మహిళా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక శోభన బాబు, కృష్ణం రాజు వంటి పెద్ద హీరోలతో కలిసి నటించిన సుమన్ గారు ఆయన నటనకు నంది అవార్డు కుడా అందుకున్నారు. అయితే ఆయన కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఆ విషయాలను అప్పటి పరిస్థితులను సుమన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వివరించారు.

నేను ఊ అంటే నా పక్కన పడుకోడానికి హీరోయిన్లు రెడీ…
చెన్నై లోని ఒక బిజీ సెంటర్ లో సుమన్ గొడవ చేసాడు అంటూ పోలీసులు కేసు పెట్టారు. సంవత్సరం పాటు బయటికి రాలేనంతగా ఇరికించారు. అయితే సుమన్ తల్లికి అప్పటి తమిళనాడు గవర్నర్ కు చదువుకునే రోజుల నుండే మంచి స్నేహం ఉండటం వల్ల ఆయన ద్వారా రెండు నెలలకే కండిషనల్ బెయిల్ తెప్పించి ఆ పైన పోరాడి కేసు నుండి బయటకు రప్పించగలిగారు. అయితే అటువంటి పరిస్థితిలో సుమన్ కు అండగా ముగ్గురు హీరోయిన్లు నిలిచి తమిళనాడు లోని కుముదం పత్రికలో సుమన్ చాలా మంచివాడు అంటూ చెప్పారు. తమిళ పత్రికలు సుమన్ గురించి తప్పుగా రాస్తున్న సమయంలోనే అలా ముగ్గురు హీరోయిన్లు చేయడం ఆశ్చర్యకరం. ఇక తమిళ పత్రికలు రాసిన దానికి పూర్తి భిన్నంగా తెలుగు వార పత్రికలు రాసేవట. తమిళ పత్రికలు రాసినవాటిని చూపుతూ సుమన్ కు అలాంటి పనులు చేయాల్సిన పని లేదంటూ తాను ఎంత పెద్ధ హీరోనో తెలుగులో చెబుతూ తెలుగులో ఆర్టికల్స్ వచ్చేవట.

సుమన్ కావాలనుకుంటే స్టార్ హీరోయిన్స్ తనతో పడుకుంటారని అటువంటి ఏజ్ ఉన్న అతనికి ఇలాంటి పనులు అవసరం లేదంటూ రాసేవరని సుమన్ ఇంటర్వ్యూలో తెలిపారు. అపుడు తెలుగు ప్రింట్ మీడియా నాకు చాలా సపోర్ట్ ఇచ్చి ధైర్యం చెప్పింది. కేస్ వల్ల జైల్లో దాదాపు 6 నెలలు మగ్గాను ఆపైన కండిషనల్ బెయిల్ మీద మధురై లో కొంతకాలం ఆపైన చెన్నై లో మాత్రమే ఉండాలని కొంతకాలం అలా కండిషన్స్ మీద పెట్టి ఆపైన కేసును కొట్టేసారు. ఆ తరువాత పరువు నష్టం దావా వేయాలని అనుకోలేదు అవన్నీ సినిమాల్లోనే జరుగుతాయి, నిజ జీవితంలో చాలా ప్రాసెస్ ఉంటుంది అందుకే వేయలేదు అంటూ సుమన్ తెలిపారు.


































