Senior Heroine Bhanu Priya : వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘సితార’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది భానుప్రియ. తరువాత కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘స్వర్ణకమలం’ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. స్వతహాగా నాట్య కళాకారిణి కావాడం మరో విశేషం. భానుప్రియ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషలలో దాదాపు 110 చిత్రలలో నటించింది. తెలుగులో దాదాపుగా అగ్రహీరోల అందరి సరసనా నటించింది. సినిమా పరిశ్రమలో ఆమె జీవితం సాఫీగా సాగిపోయినప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది.

వాళ్ళు నన్ను పిలవలేదు…
80 లలో హీరో హీరోయిన్స్ గా పనిచేసిన తరాలందరూ కలిసి ఒక 80 రీ యూనియన్ బ్యాచ్ అంటూ ఒక గ్రూప్ లాగా అందరూ అప్పుడప్పుడు కలిసి గడుపుతుంటారు. ఒకే కలర్ బట్టలు వేసుకుని ఆట పాటలతో ఎంజాయ్ చేస్తుంటారు. ఆ రీ యూనియన్ లో రాధ, రాధిక, సుహాసిని, ఖుష్బు వంటి తరాలతో పాటు అప్పటి అగ్ర హీరోలు అందరూ ఉన్నారు. అయితే ఆ రీ యూనియన్ లో ఎన్నడూ భానుప్రియ కనిపించలేదు.

ఇదే విషయాన్ని భానుప్రియ గారిని అడిగినపుడు ఆ రీ యూనియన్ కు నాకు ఏం సంబంధం లేదని, నన్ను ఎపుడూ పిలవలేదని చెప్పారు. అంతేకాకుండా నాకు అలా పబ్స్ కి పార్టీస్ కి వెళ్లడం ఇష్టం లేదని చెప్పారు. ఇక తనతో అప్పుడప్పుడు సుహాసిని, రాధ వంటి వారు మాట్లాడుతుంటారంటూ చెప్పారు. ఒక రెండేళ్ల క్రితం ఆరోగ్యం బాగోలేదని తెలిసి రాధ వచ్చి పలకరించి వెళ్లిందని చెప్పారు భాను ప్రియ.































