Senior Heroine Divyavani : బాపు గారి సినిమాల్లో హీరోయిన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది దివ్య వాణి. పెళ్లి పుస్తకం సినిమాలో సత్యభామ గా ఆమె నటన అందరినీ ఆకట్టుకుంటుంది. వాలు జడ, పెద్ద కళ్ళతో తెలుగింటి అమ్మాయి అంటే అలానే ఉండాలి అనేంతలా దివ్య వాణి అందం తెలుగు ప్రేక్షకులను ఆకర్షింకింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దివ్య వాణి అసలు పేరు ఉషారాణి. ఆమె మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక సినిమాలో నటించిన తరువాత హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం ఇలా అన్ని భాషలలోనూ సినిమాలను చేసిన దివ్య వాణి తన కెరీర్ అలానే వ్యక్తిగత జీవితం గురించి అలాగే రాజకీయాల్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఇటీవల ఇంటర్వ్యూలలో పంచుకున్నారు.

కాళ్ళు పట్టుకుని బతిమలాడాను…
దివ్యవాణి గారు తెలుగులో మొదట చేసిన సినిమాలు పెద్దగా ఆడకపోయినా పెళ్లి పుస్తకం సినిమాలో రాజేంద్రప్రసాద్ కు జోడిగా సెలెక్ట్ అయ్యారు. ఆ సినిమా ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. ఇక ఆ సినిమా తరువాత ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం’ సినిమా కూడా మంచి హిట్ అలా వరుసగా మూడు సినిమాలు ఒకే ఏడాది లో హ్యాట్రిక్ కాగా మూడు సినిమాల్లోను రాజేంద్ర ప్రసాద్ గారికి హిట్ పెయిర్ గా దివ్యవాణి నిలిచారి. అయితే బాపు గారి కాంబినేషన్ లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా మరోసారి వచ్చిన ‘మిస్టర్ పెళ్ళాం’ సినిమాలో హీరోయిన్ గా కూడా దివ్య వాణి ని సెలెక్ట్ చేసినా కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో ఆమెను తీసుకోకుండా ఆమని ని హీరోయిన్స్ గా పెట్టారట.

ఈ విషయం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దివ్యవాణి మాట్లాడుతూ సినిమాలో హీరోయిన్ ను మార్చవద్దు అని కాల్ చేసి అడగడం కాళ్ళు పట్టుకునే వరకు అన్నీ అయ్యాయి కానీ బాపు గారు కూర్చోబెట్టి మాట్లాడినా కూడా కొంతమందికి నన్ను సినిమాలో పెట్టుకోవడం ఇష్టం లేక తీయించారు. నేను అల్పసంతోషిని, నాకు లభించిన దానితో నేను హ్యాపిగా ఉంటాను అంటూ తెలిపారు దివ్యవాణి. నిచ్చెన ఎక్కాలని ఎలా అయినా ఎక్కేయాలి అనుకునే వ్యక్తిత్వం తనకు లేదని వివరించారి దివ్యవాణి.

































