Senior Heroien Vanisri Assistant Ramanaiah : నెల్లూరుకి చెందిన రత్నకుమారి ఇండస్ట్రీ లో అడుగుపెట్టి మొదట చిన్న చిన్న పాత్రలు చేసిన ఆమె అనతి కాలంలోనే హీరోయిన్ గా ఎదిగి కలాభినేత్రిగా పేరు తెచ్చుకున్న ఆ హీరోయిన్ మరెవరో కాదు వాణిశ్రీ. సావిత్రి గారి తరువాత అంతటి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ వాణిశ్రీ . తెలుగు కన్నడ, తమిళం ఇలా అన్ని భాషల్లో అగ్ర హీరోయిన్ గా ఎదిగిన వాణిశ్రీ గారు పెళ్లయ్యాక నటనకు దూరమై మళ్ళీ రీఎంట్రీలో అత్త పాత్రలో మెప్పించింది . ఇక ఆమె సినిమా కెరీర్ గురించి పలు విషయాలను ఆమెకు అసిస్టెంట్ గా పనిచేసిన రమణయ్య ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

కొడుకు ఎలా మరణించడంటే….
వాణిశ్రీ నాటకాలలో నటిస్తూ కెరీర్ ప్రారంభించి ఆతరువాత సినిమా మీద ఆసక్తి తో అటు వైపు వెళ్లారు. మద్రాస్ వెళ్లిన తొలినాళ్ళలో కామెడీ తరహా పాత్రలను చేసిన వాణిశ్రీ ఆతరువాత హీరోయిన్ గా నటించారు. చాలా తక్కువ టైములోనే టాప్ హీరోయిన్ గా ఎదిగిన వాణిశ్రీ కెరీర్ బాగా ఉన్నపుడే తన ఫ్యామిలీ డాక్టర్ అయిన కరుణాకరణ్ ను పెళ్లి చేసుకున్నారు.

ఆయన ఏంఎస్ చేయడానికి విదేశాలకు వెళ్లాలని భావించినపుడు ఆస్తుల విషయంలో సినిమా విషయంలో అక్క బావ తో గొడవలు రావడంతో వాణిశ్రీ చాలా కష్టాలు పడ్డారు అంటూ వాణిశ్రీ గారికి అసిస్టెంట్ గా పని చేసిన రమణయ్య తెలిపారు. ఇక వాణిశ్రీ గారికి ఒక కొడుకు ఒక కూతురు కాగా ఇద్దరు డాక్టర్లు. అయితే కొడుకు ప్రొఫెసర్ గా ఉండి భార్య ఇద్దరు పిల్లలు ఉండగా కారణాలు తెలియవు కానీ ఆత్మహత్య చేసుకున్నారు. ఇక కూతురు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు అంటూ వాణిశ్రీ గారి వ్యక్తిగత జీవితం గురించి తెలిపారు.






























