Senior Journalist Bhardwaja : వర్ధమాన నటుడు విశ్వక్ సేన్.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న విశ్వక్ సేన్ ఈ మధ్య తరచూ వివాదాల్లో ఉంటున్నాడు. ఇప్పుడిప్పుడే హీరో గా ఎదుగుతున్న క్రమంలో మంచి ప్రాజెక్ట్స్ అందుకుంటున్న విశ్వక్ సేన్ తన అవకాశాలను తానే పోగొట్టుకుంటున్నట్లుంది అతని వ్యవహారశైలి. తాజాగా సీనియర్ నాటుడు అర్జున్ ఆయన కూతురిని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక తెలుగు సినిమా చేయాలని నిర్ణచుకుని అందులో హీరో గా విశ్వక్ సేన్ బాగుంటాడని అనుకుని విశ్వక్ ను కలిసి కథ వివరించి ఓకే చేసారు. సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉండగా విశ్వక్ వల్ల కొద్ది రోజులు వాయిదా పడింది. ఇక మళ్ళీ తిరిగి షెడ్యూల్ మొదలయ్యే సమయానికి మళ్ళీ విశ్వక్ రాకపోవడం, ఏ కారణం చెప్పకుండా ఉండటంతో అర్జున్ సర్జ ఫిల్మ్ ఛాంబర్ లో ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ ప్రవర్తన ఏం బాగోలేదంటూ మాట్లాడారు. ఈ వివాదం వల్ల విశ్వక్ కెరీర్ పోతుందా, అసలు తప్పు ఎవరిది అనే విషయాల మీద సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ మాట్లాడారు.

ఇద్దరిలో తప్పు ఎవరిదంటే…
ఇండస్ట్రీ లో ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేయడం కామన్ అయినా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న విశ్వక్ లాంటి హీరోల కెరీర్ మీద ఒక మచ్చ లాగా ఉండిపోతుంది అంటూ చెప్పారు భరద్వాజ గారు. ఏ నటుడికైనా కెరీర్ లో మంచి స్థానానికి వెళ్లాలంటే అంకిత భావంతో ఒక్క రిమార్క్ కూడా లేకుండా పనిచేసుకుంటూ వెళ్ళాలి. సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి లాంటి సూపర్ స్టార్లు కూడా ఇలా ఎదిగిన వారే, వాళ్ళు ఏనాడూ ఒక నిర్మాతను ఇబ్బంది పెట్టలేదు ఇక అలా కష్టపడ్డారు కాబట్టే నేడు ఈ పొజిషన్ లో ఉన్నారు. కానీ ఇప్పుడొస్తున్న హీరోలు అలా లేరు అంటూ చెప్పారు. ఇక అర్జున్ విశ్వక్ విషయంలో అర్జున్ ముందుకొచ్చి జరిగింది చెప్పారు.

నిజంగా విశ్వక్ కారణాలు చెప్పకుండా షూటింగ్ కి హాజరువ్వకుండా ఉండుంటే మాత్రం అది విశ్వక్ కెరీర్ మీద ప్రభావం చూపుతుంది. ఇక్కడ అర్జున్ గారికి పోయేదేమి లేదు. అయితే ఆయన ఫిల్మ్ ఛాంబర్ లో ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ ను విమర్శించారు కానీ ఫిర్యాదు ఇచ్చారో ఇస్తారో ఇంకా తెలీదు. ఒకవేళ ఫిర్యాదు ఇస్తే అది విశ్వక్ కెరీర్ మీద ప్రభావం చూపుతుంది, అలా కాదని రాజీ పడే అవకాశం కూడా ఉంది. ఒకవేళ రాజీ పడి షూటింగ్ మళ్ళీ కొనసాగించవచ్చు. ఎక్కడా శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు కదా అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు.



























