Senior Journalist Bhardwaja : దివంగత నటి తమిళనాడు సీఎం జయలలిత మరణం మీద అనుమాణాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఉన్న డిఏంకే ప్రభుత్వం ఆమె మరణం మీద సందేహాలు ఉన్నాయని ఆర్ముగం ఆధ్వర్యంలో కమిటీ వేశారు. ఇక ఆ నివేదిక తాజాగా తమిళనాడు అసెంబ్లీ ని ఉపేస్తోంది. జయలలిత గారి మరణం సహజంగా లేదంటూ ఆమె మరణించిన సమయం కూడా తప్పుగా నమోదు చేయడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆ నీవేదికలో పేర్కొనడం ఇప్పుడు అనేక చర్చలకు తావిస్తోంది. ఇక ఇదే విషయంలో మీద సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు విశ్లేషంచారు.

మరణానికి వారే కారణం…
భరద్వాజ గారు మాట్లాడుతూ పొలిటికల్ గా మైలేజ్ కోసం స్టాలిన్ ప్రభుత్వం జయలలిత మరణం పై కమిటీ వేసింది. అయితే ఇందులో పేర్కొన్న విషయాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయంటూ చెప్పారు. ఆమె మరణానికి తన నెచ్చెలి శశికళ అలాగే అప్పటి ప్రభుత్వ సిఎస్ ఇంకా అపోలో హాస్పిటల్ కారణమంటూ చెప్పారు. హాస్పిటల్ లో చేరాక ఆమెకు ఊపిరితితుల్లో ఇన్ఫెక్షన్ ఉందని విదేశాల్లో వైద్యం చేయించాలని చెప్పిన అపోలో హాస్పిటల్ లోనే చికిత్స అందించారు. ఇంగ్లాండ్ నుండి వైద్యలు వచ్చి చూసి ఆమెకు సర్జరీ అవసరమని చెప్పి మళ్ళీ మాట మార్చి వెళ్లిపోయారు.

ఇక హాస్పిటల్ ను అక్కడ జయలలిత వైద్యాన్ని శశికళ తన అదుపులో ఉంచుకున్నారు అన్నదే ఇప్పుడు వస్తున్న అనుమానం. ఆమె హాస్పిటల్ యాజమాన్యంకి ఏం చెప్పి మేనేజ్ చేశారన్నది ఇప్పుడున్న గవర్నమెంట్ తెలుసుకోవాలి, అలా చేస్తే అపోలో యాజమాన్యం కూడా విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. స్టాలిన్ ప్రభుత్వం నిజాయితీగా విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అలాకాదని వారికి సన్నిహితులెవరైనా ఇందులో ఉన్నారని ఈ నివేదికను కేవలం పొలిటికల్ మైలేజ్ కి వాడుకుంటే ప్రయోజనం లేదని చెప్పారు. ఒకవేళ నిజంగా విచారణ చేస్తే అది కచ్చితంగా జయలలిత కు నివాళి అవుతుంది అంటూ చెప్పారు.





























