Senior Journalist Bhardwaja : సినిమాల గురించి విశ్లేషణలు, సమాకాలిన అంశాల మీద ఆయన అభిప్రాయాలను చెబుతూ యూట్యూబ్ లో పలు ఇంటర్వ్యూ లలో పాల్గొనే భరద్వాజ గారు అనేక అంశాల గురించి పూర్తి వివరణ ఇస్తుంటారు అవి ఎన్నో ఏళ్ళ క్రితం జరిగిన అంశాలైన సరే ఎంతో వివరంగా చెప్పడం ఆయన జ్ఞాపక శక్తికి నిదర్శనం. ఇక బ్రాహ్మణ కుటుంబం లో జన్మించిన భరద్వాజ గారు హేతు వాదిగా మారడానికి వామపక్ష భావజాలనికి వెళ్ళడానికి ప్రభావితం చేసిన అంశాల గురించి మాట్లాడారు.

జైలు లో హింసించారు…. మూడున్నర ఏళ్ళు జైలు జీవితం….
వామపక్ష భావజాలం ఉన్న భారద్వాజ గారికి ఆ ఆలోచనలు దాదాపు ఎనిమిదవ తరగతి చదివే రోజుల్లోనే వచ్చేసింది. ఆయనకు ట్యూషన్ చెప్పే మాస్టారు శ్రీకాకుళం ఉద్యమంలో పాల్గొని వెనక్కి వచ్చారు ఆయన ద్వారా చలం, రంగనాయకమ్మ పుస్తకాలను చదవడం ద్వారా ప్రభావితమైన భరద్వాజ గారు ఇంటర్ వచ్చేసరికి సమాజం మీద నిర్ధిష్టమైన ఆలోచనల్తో ఉన్నారు. లా చదువును మధ్యలో ఆపేసి పీపుల్స్ పార్టీలో ఉన్న ఆయన మీద పదమూడు కేసులు వేశారని అందులో చాలా వరకు కొట్టేసారంటు తెలిపారు. ఇక ఒకసారి జైలుకి వెళ్ళినపుడు మాత్రం డి టి నాయక్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ రాష్ట్ర కమిటీ నాయకుడి సమాచారం కోసం అరెస్ట్ చేసి టార్చర్ చేసారంటూ చెప్పరు . ఆయన మెడిసిన్ చదివి ఐపిఎస్ చదివి పోలీస్ అవ్వడం వల్ల అనాటమి గురించి బాగా తెలుసు అంటూ భరద్వాజ గారు తెలిపారు.

అలా నిజం చెప్పించడానికి కాలర్ బోన్ ను డిస్ లొకేట్ చేసి ఆ నొప్పికి భరించలేక నిజం చెబుతానని అలా హింసించినా , చెప్పక పోయేసరికి ఉదయం వరకు చూసి అప్పటికి చెప్పలేదు ఇక డిస్ లొకేట్ చేసిన ప్రాంతంలో కండ పెరగడం స్టార్ట్ అవడంతో ఆయనకు సరి చేయడానికి రాక మరో ఆర్థో డాక్టర్ ను పిలిచి చేయించారు అలా టార్చర్ ఎంత చేసిన వాళ్లకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేది కాదు మాకు పార్టీలో ఎపుడో ఇలాంటివి ఎదుర్కొనడానికి ట్రైనింగ్ యిస్తారు అంటూ అప్పటి విషయాలను తెలిపారు. ఇక మరో సారి జైలుకి వెళ్ళినపుడు మూడు నెలల్లో వస్తా అనుకున్న ప్రతిసారి నాపై కేసులు పెడుతూ పెడుతూ బెయిల్ రాకుండ చేసి దాదాపు 3 సంవత్సరాలు జైలు లో ఉండాల్సి వచ్చింది. ఆతరువాత నెమ్మదిగా దాదాపు అన్ని కేసులు కొట్టేసారు అంటూ చెప్పారు.































