Senior Journalist Bhardwaja : ఏపీ రాజకీయాల్లో కొత్తవ్యూహలకు పదును పెట్టింది అధికార పార్టీ. తెలుగు దేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గారిని రాజకీయంగా వాడుకుంటూ చంద్రబాబును ఇరుకున్న పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొదట కృష్ణ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి టీడీపీ నుండి ఎన్టీఆర్ ను దూరం చేసేందుకు అడుగులు వేసారు. పదే పదే వెన్నుపోటు అంటూ లక్ష్మీ పార్వతి చేత మాట్లాడించి ఆమెకు చేయూతనిస్తూ మరింత టీడీపీకి ఎన్టీఆర్ ను దూరం చేసే వ్యూహాలు రచిస్తున్నారు. అయితే తాజాగా ‘భారతరత్న’ అవార్డు ఎన్టీఆర్ కి అంటూ కొత్త పల్లవి అందుకుంటూ జగన్ మాస్టర్ ప్లాన్ వేసాడంటూ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు విశ్లేషించారు.

ఎన్టీఆర్ కు భారతరత్న టీడీపీ కి చెక్ పెట్టేందుకే…
సీనియర్ ఎన్టీఆర్ ఒకవైపు సినిమాల్లో తిరుగులేని, ఎవరికీ సాధ్యం కానీ ఎన్నో రికార్డులు నెల్కొల్పిన లెజెండ్రి నటులు. ఇక రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసి కేంద్ర రాజకీయాల్లోనూ చక్రం తిప్పిన గొప్ప నాయకుడు. అలాంటి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం అవార్డుల్తో సత్కరించకపోవడం విడ్డూరం. ఇక ఎన్టీఆర్ కు భారతరత్న విషయంలో చాలా రాజకీయాలే జరిగాయంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇస్తే ఆ అవార్డును భార్య స్థానంలో ఉన్న లక్ష్మి పార్వతి ప్రోటోకాల్ ప్రకారం తీసుకోవాలి, అది ఇష్టం లేని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ అవార్డు విషయంలో చొరవ చూపలేదు.

అయితే ఇదే విషయంలో ఇప్పుడు బీజేపీ వైసీపీ రాజకీయం చేయాలనుకుంటున్నాయి. టీడీపీని ఇరుకున పెట్టేందుకు జగన్ తో కలిసి మాస్టర్ ప్లాన్ వేసింది బీజేపీ అంటూ భరద్వాజ అభిప్రాయపడ్డారు. జగన్ ఎన్టీఆర్ ను టీడీపీ నుండి వేరు చేసేందుకు చూస్తుంటే బీజేపీ భారతరత్న క్రెడిట్ తన ఖాతాలో వేసుకుని ఆంధ్ర రాజకీయాల్లో లబ్ది పొందాలని చూస్తోంది అంటూ భరద్వాజ అభిప్రాయపడ్డారు.