Senior Journalist Bhardwaja : ‘చిత్రం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఉదయ్ కిరణ్ అనతి కాలంలోనే మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస హిట్లతో అగ్ర హీరో రేంజ్ కి ఎదిగిన ఉదయ్ కిరణ్ జీవితంలో అనుకోకుండా చిరంజీవి కూతురుతో ఎంగేజ్మెంట్ అవ్వడం, ఆ తరువాత ఆది క్యాన్సిల్ అవడం ఇవన్నీ ఒకెత్తయితే ఇక మెల్లగా చేసిన సినిమాలన్నీ ఫ్లాప్స్ అయి కెరీర్ డౌన్ ఫాల్ మొదలై సినిమాలు లేక ఖాళీగా ఉండలేక డిప్రెషన్ లో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. అయితే ఇదంతా జరిగి చాలా ఏళ్ళు గడిచినా ఇప్పుడు డైరెక్టర్ తేజ ఉదయ్ కిరణ్ గురించి బయో పిక్ తీస్తాను, అతను ఇలా ఎందుకు మరణించాడో అసలైన నిజాలను చెబుతాను అంటూ ప్రకటించడంతో మరోసారి ఉదయ్ కిరణ్ గురించి చర్చ మొదలైంది. ఇక ఈ విషయాల గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడారు.

ఉదయ్ కిరణ్ మరణం గురించి నాకన్నీ తెలుసు…
భరద్వాజ గారు మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ కి మెగాస్టార్ చిరంజీవి కూతురు తో ఎంగేజ్మెంట్ ఆ తరువాత అది రధ్ధవడం తోనే తన సినిమా కెరీర్ పతనం అయింది అంటూ అప్పట్లో చాలా మంది అనుకునేవారు. ఇప్పటికీ ఉదయ్ కిరణ్ మరణం గురించి మాట్లాడితే కొంతమంది అలానే భావిస్తారు అంటూ చెప్పారు. అయితే ఉదయ్ కిరణ్ ఫ్యామిలీలో ఆత్మహత్య ఆలోచనల తాలుకు డిసార్డర్ ఉంది అందుకే డిప్రెషన్ లో ఇలా చేసుకున్నాడు అంటూ కొన్ని వార్తలు వినిపించినా ఇప్పుడు డైరెక్టర్ తేజ మాటలు మళ్ళీ ఉదయ్ కిరణ్ మరణం గురించి చర్చకు దారి తీసాయి.

తేజ మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ నాతో అన్నీ షేర్ చేస్తాడు, తన ప్రతి బాధ నాతో చెప్పేవాడు, తన మరణానికి కారణం కూడా నాకు తెలుసు సమయం వచ్చినపుడు ఖచ్చితంగా చెబుతాను. కాకపోతే ఇప్పుడు సమయం కాదు నేను చనిపోయేలోపు ఖచ్చితంగా నిజాలు చెప్తాను అంటూ అనడం ఇవన్నీ ఏదో మిస్టరీ ఉంది అనే అర్థం వచ్చేలా కనిపిస్తున్నాయి అంటూ భరద్వాజ గారు మాట్లాడారు. భరద్వాజ గారు మాట్లాడుతూ తేజ చనిపోయేలోపు చెబుతా అన్నాడు అంటే సినిమా ఇండస్ట్రీ పెద్దవాళ్ళు ఉదయ్ మరణం వెనుక ఉన్నారు అని అర్థం వచ్చేలా మాట్లాడటం వల్ల మరోసారి కాంట్రావెర్సీ అయింది అంటూ అభిప్రాయపడ్డారు.


































