Senior Journalist Bhardwaja : తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరు రెండు కళ్ళలాంటి వారు. ఇద్దరు సమాకాలిన అగ్రహీరోలు అయినకూడా ఇద్దరు కలిసి చాలా సినిమాల్లో కలిసి నటించడం వారికే చెల్లింది. సినిమా రంగంలో పోటీ ఉంటుంది కానీ ఇద్దరు అగ్రహీరోలు మాత్రం ఆరోగ్యాకరమైన పోటీనిస్తూనే మంచి మిత్రులుగా కలిసి ఉండేవారు. అలాగే చిత్ర పరిశ్రమకు సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేవారు. ఇక అలాంటి వీరిద్దరి మధ్య మస్పర్తలు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఒకసారి మాత్రం కోర్ట్ వరకు వెళ్లి పోరాడారు ఈ ఇద్దరు అగ్ర హీరోలు.
అన్నపూర్ణ స్టూడియోస్ వివాదం…..

మద్రాస్ నుండి సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ తరలించాలని నిర్ణయం తీసుకున్నపుడు ప్రభుత్వం హైదరాబాద్ లో స్థలాలను కేటాయించారు. అలా ఏఎన్ఆర్ గారు హైదరాబాద్ వచ్చి ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో అన్నపూర్ణ స్టూడియోస్ ను నిర్మించారు . అలా నిర్మించినపుడు అక్కడ ఉన్న కొండ దిగువ ప్రాంతం కూడా వారికే కేటాయించింది ప్రభుత్వం. అయితే సినిమా పరిశ్రమా అభివృద్ధి కోసం సినిమా స్టూడియో నిర్మిస్తే షూటింగులు జరుగుతాయానే ఉదేశ్యం తో ప్రభుత్వం కేటాయిస్తే నాగేశ్వరావు టింబర్ వ్యాపారం ను 7 ఎకరాల భూమిలో నిర్వహించేవారు.

అయితే అన్నపూర్ణ స్టూడియో నిర్మించి అక్కడ సినిమా షూటింగులు జరుగుతున్న క్రమంలో పక్కన ఉన్న ఏడు ఎకరాలలో టింబర్ వ్యాపారం చేయడాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం ఈ విషయంలో కోర్ట్ కి వెళ్ళింది. ఏఎన్ఆర్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ కోర్ట్ లో పోరాడారు. అయితే ఏఎన్ఆర్ గారు అక్కడ ఉన్న టింబర్ వ్యాపారాన్ని ఏలూరుకి తరలించి అక్కడ కేవలం సినిమా షూటింగ్స్ మాత్రం జరుగుతాయి అన్నట్లు కోర్టులో చూపించారు. కానీ కేసు ఎన్టీఆర్ సీఎం గా ఉన్నన్ని రోజులు నడిచి చివరకు తరువాత ఎన్నికల్లో కాంగ్రెస్ వచ్చినపుడు అప్పటి ముఖ్యమంత్రితో మాట్లాడి నాగేశ్వరావు గారు కేసులను కొట్టేయించుకున్నారు అలా ఆ వివాదం ముగిసింది అంటూ భరద్వాజ గారు అప్పటి విషయాలను తెలిపారు.



























