Senior Journalist Bhardwaja : ఎన్టీఆర్ అనగానే గొప్ప పౌరణికాలు, అలాగే జానపద చిత్రాలు గుర్తుకువస్తాయి. ఆయన ఆ జోనర్స్ లో మరెవరూ సాహసించినటువంటి చిత్రాలను తన నటనతో రక్తి కట్టించారు. అప్పట్లో జానపదాలు, పౌరణికలు అంటే ఎన్టీఆర్, సాంఘిక చిత్రలంటే ఏఎన్ఆర్ అనేలా వారి సినిమాలు సాగేవి. కానీ సాంఘిక సినిమాల్లో కూడా నేను మిన్న అని నిరూపించుకున్నారు ఎన్టీఆర్. రక్త సంబంధం, మిస్సమ్మ, బడిపంతులు, వంటి చిత్రాలతో మెప్పించారు. వయసుమల్లిన పాత్రలో కనిపించి బడిపంతులు సినిమాలో రిస్క్ చేసినా ప్రేక్షకులు మాత్రం ఆ సినిమాలకు నీరాజనాలు పలికారు. ఇక రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి రాజకీయాల్లో తెలుగు ప్రజలకు చైతన్యం అలాగే గుర్తింపు తెచ్చారు.

మేజర్ చంద్రకాంత్ సినిమాకు అంత తీసుకున్నారు…
ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చేందుకు సినిమాలకు గుడ్ బై చెప్పాలని భావించారు. అలా సినిమాలను తగ్గించి ఇక రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్న సమయంలో మేజర్ చంద్రకాంత్ సినిమాను చేసారు. మంచు మోహన్ బాబు గారు నటిస్తూ నిర్మించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు కీలక పాత్రలో నటించారు. ఆ సినిమాకు రాఘవేంద్ర రావు గారు డైరెక్టర్. సినిమా సూపర్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఆ సినిమాకు ఎన్టీఆర్ గారు తీసుకున్న రెమ్యూనరేషన్ అప్పట్లో బాగా చర్చనీయాంశం అయింది.

అప్పటికి చిరంజీవి గారు ఒక ఏరియా హక్కులను తీసుకునే రేంజ్ కి ఎదిగిపోయారు. అలాంటి సమయంలో ఎన్టీఆర్ గారు రెమ్యూనరేషన్ గా కోటి రూపాయలు తీసుకున్నారు అంటూ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు వివరించారు. ఆయన ఒక వెండి పళ్లెంలో ముప్పై లక్షలు పెట్టి కాళ్ళకు నమస్కారం చేసి సినిమా చేయమని అడిగినా చేసుండేవారు కానీ ఆయన మీద గౌరవం ఆయన రేంజ్ ని బట్టి కోటి రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు రాఘవేంధ్ర రావు అలాగే మోహన్ బాబు చాలా సందర్భాల్లో వివరించారు అంటూ భరద్వాజ గారు తెలిపారు.































