Senior Journalist Bhardwaja : సినిమా ఇండస్ట్రీకి తొలినాళ్ళలో రెండు కళ్ళలాగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లను అభివర్ణిస్తారు. అయితే ఇద్దరిలో ఎన్టీఆర్ గారిని తెలుగు ప్రజలు దేవుడిగా చూసారు అలాగే మాస్ హీరోగాను చూసారు. ఏఎన్ఆర్ గారు కొన్ని జోనర్లకు మాత్రమే పరిమితమయ్యారు. ఇక ఎన్టీఆర్ జోనర్ ఏదైనా సినిమాల్లో నటించి అన్నిరంగాల ప్రజలను ఆకట్టుకుని అతిపెద్ద క్రౌడ్ పుల్లర్ గా మారారు. ఆయన సినిమాల ద్వారా థియేటర్లను నింపొచ్చు అనే ధీమా డిస్ట్రిబ్యూటర్స్ కి నిర్మాత కల్పించిన హీరో ఎన్టీఆర్ గారు. ఆయన తరువాత ఆ ప్లేస్ కృష్ణ గారికి రావాలి. ఎన్టీఆర్ తరువాత మాస్ ఆడియన్స్ ఉన్న హీరో కృష్ణ గారు కానీ ఆయన ఎక్కువ కాలం నెంబర్ వన్ ప్లేసులో లేరు, ఆ ప్లేసులో ను చిరంజీవి భర్తీ చేసారు. అయితే చిరంజీవి గారు జానపద పౌరాణిక సినిమాలను చేయలేక పోయారు. ఆ అసంతృప్తి ఆయనకి ఉంది. ఇక ఇటువంటి అంశాల గురించి విశ్లేషించారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు.

ఎన్టీఆర్ కు చిరంజీవికి అదే తేడా…
కృష్ణ గారు తనకొస్తుందనుకున్న ప్లేసుని చిరంజీవి తీసుకున్నారు. ఎన్టీఆర్ రాజకీయాలలలోకి వెళ్లిపోయిన రెండేళ్లు కృష్ణ గారి హవా నడిచినా ఆ తరువాత చిరంజీవి హవా వచ్చేసింది. దీనికి కారణం అప్పటి వరకూ ఎన్టీఆర్ కు పరిమినెంట్ గా ఉన్న నిర్మాతలు డైరెక్టర్లు కృష్ణ దగ్గరికి వెళ్లకుండా చిరంజీవి వైపు చూడటం వల్ల చిరంజీవికి మంచి సూపర్ హిట్లు పడ్డాయి. ఇక ఎన్టీఆర్ తరువాత అంత క్రౌడ్ పుల్లర్ ఎవరు అవుతారు అని భావించిన నిర్మాతలకు వరం లాగా చిరంజీవి దొరికాడు. అయితే ఎన్టీఆర్ కు చిరంజీవికి ఉన్న తేడా ఎన్టీఆర్ అన్ని జోనర్స్ లో సినిమాలను చేసారు. జానపద, పౌరాణిక, సాంఘిక, విషాద ఇలా అన్ని చేసి ప్రేక్షకులను అలరించారు, ఒక మాస్ హీరోని చేసారు.

అయితే చిరంజీవి పౌరానికాలు జానపదాల జోలికి పోలేదు. కేవలం అప్పటి యూత్ కు నచ్చేలాంటి సినిమాలను చేస్తూ ట్రెండ్ నడిపారు. కాస్టూమ్ డ్రామాలో నటించలేదనే అసంతృప్తి చిరంజీవిలో ఉంది సైరా సినిమా అప్పుడు ఆ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. కానీ ఒకానొక టైంలో చేయాలనుకున్నా ఎందుకో వెనకడుగు వేశారు. ఇక రాజకీయాల్లోకి వెళ్లి వెనక్కి వచ్చాక ఆయన చేస్తున్న సినిమాలు పెద్దగా హిట్లు కావడం లేదు, ఇప్పటికీ రీమేక్ ల మీద ఆధారపడుతున్నారు. ఆయన ఎన్టీఆర్ అంత క్రౌడ్ పుల్లర్ అయినా కూడా ఏఎన్ఆర్ లాంటి జాగ్రత్తపరుడు. దూకుడుగా అన్ని జోనర్స్ లో సినిమాలను చేయలేదు అంటూ భరద్వాజ గారు అభిప్రాయ పడ్డారు.



























