Senior Journalist Bhardwaja : దర్శకేంధ్రుడు కే రాఘవేంద్ర రావు కి సినిమా వారసత్వం ఉన్నా ఆర్థికంగా ఎన్నో కష్టాలను పడి సినిమాల్లో రాణించి ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నారని చాలా తక్కువ మందికి తెలుసు. రాఘవేంద్ర రావు గారి నాన్న కే ఎస్ ప్రకాష్ రావు గారు కూడా దర్శకులు. ఇక ఆయన అన్నకొడుకు బాపయ్య కూడా దర్శకుడే. ఇక ఆయన పెద్ద కొడుకు కృష్ణ మోహన్ అంతగా ఎవరికీ పరిచయం లేకపోయినా ఇక కే ఎస్ ప్రకాష్ రావు గారి రెండో భార్య అలనాటి నటి వరలక్ష్మి గారు. వరలక్ష్మీగారు ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా అక్కినేని గారికి ఎన్టీఆర్ గారికి నటించారు. అలానే తల్లిగా అత్త పాత్రలలోనూ మెప్పించారు. వరలక్ష్మి గారికి ప్రకాష్ రావు గారికి పుట్టిన బిడ్డ పేరు కూడా ప్రకాష్ రావు అవ్వడం విశేషం. ఇక వరలక్ష్మి గారి అబ్బాయి డి ఓ పి గా సినిమాలకు పనిచేసారు.

రాఘవేంద్ర రావు గారి తల్లి వరలక్ష్మి కాదు…
రాఘవేంద్ర రావు గారి తండ్రి కే ఎస్ ప్రకాష్ రావు గారి మొదటి భార్య పిల్లలు కృష్ణ మోహన్ అలాగే రాఘవేంద్ర రావు. అయితే వరలక్ష్మి గారు కే ఎస్ ప్రకాష్ రావు గారి కొడుకు ప్రకాష్ రావు గారు. చాలా మంది రాఘవేంద్ర రావు గారు కుడా వరలక్ష్మి గారి కొడుకు అని అనుకుంటారు కానీ కాదు అని సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు క్లారిటీ ఇచ్చారు. ఇక రాఘవేంద్ర రావు గారు సినిమా ఇండస్ట్రీకి వచ్చే నాటికి వాళ్ళ ఆర్ధిక పరిస్థితి అంత బాగా ఏమి లేదు. రాఘవేంద్ర రావు గారు బాధ్యత తీసుకుని తన అన్న, తన సవతి తమ్ముడి కుటుంబాన్ని చక్కదిద్ధారు. తన అన్న అల్లుడు బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ. బాహుబలి రెండవ భాగం లో రాఘవేంద్ర రావు గారు డబ్బు పెట్టారు. అయితే శోభు యార్లగడ్డ కి సహాయం చేసారు. ఇక వాళ్ళ అన్న పిల్లల పెళ్లిళ్లు అన్ని బాధ్యతలు ఆయనే తీసుకున్నాడు అంటూ చెప్పారు. ఇక వరలక్ష్మి గారు చాలా ముక్కుసూటిగా ఏదైనా నచ్చక పోతే గోడవపడే మనస్తత్వం కలవారని భరద్వాజ గారు చెప్పారు.

ఆవిడ కే ఎస్ ప్రకాష్ రావు గారి సినిమాల్లో దాదాపు పది, పదిహేను వరకు సినిమాల్లో నటించారు. ఇక వరలక్ష్మి గారు కమ్యూనిస్ట్ భావజాలంతో ఉండేవారు. తమిళనాడు రాజకీయాల్లో కూడా పాల్గొని పాలకులను ప్రశ్నించారు. ఇక ఒకానొక సందర్భంలో కే ఎస్ ప్రకాష్ గారితో గొడవ జరిగి పహిల్వాన్ తో వెళ్లిపోయారు. మళ్ళీ ప్రకాష్ రావు గారి దగ్గరికి తిరిగి వచ్చినా ఆ కుటుంబం చేరదిసారు. వరలక్ష్మి గారి పట్ల గాని ఆమె కుమారుడి పట్ల గాని రాఘవేంద్ర రావు గారు ఆయన అన్నగారు ఎప్పుడు బేధభావం చూపలేదు. వరలక్ష్మి గారి తనయుడు ప్రకాష్ రావు డైరెక్టర్ గా మోహన్ బాబు తో రెండు సినిమాలను చేసారు.



























