Senior Journalist Bhardwaja : అప్పటితరం అగ్ర నటుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ హీరోలుగా ఒకెత్తయితే సావిత్రి, జమున హీరోయిన్లుగా మరో ఎత్తు. అయితే సావిత్రి గారితో ఎటువంటి ఇబ్బందులు ఎపుడూ అగ్ర హీరోలు ఎదుర్కొనలేదు కానీ జమున గారి స్వభావం వల్ల ఇద్దరు అగ్ర హీరోలు అప్పట్లో ఆమెను మూడేళ్లు వారి సినిమాల్లో నటించకుండా బ్యాన్ చేసారు. అయితే అసలు జమున గారికి ఎన్టీఆర్ గారికి మధ్య తగాదాలకు కారణం ఎవరు అనే విషయాలను సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు వివరించారు.

ఎన్టీఆర్, జమునను దూరం చేసిన ఏఎన్ఆర్…
ఇటీవలే వృధాప్య సమస్యలతో జమున గారు మరణించిన సంగతి తెలిసిందే. ఆమె గురించిన అనేక విషయాలను ఆమె సినిమా జీవితం గురించి ప్రముఖ సీనియర్ సినిమా జర్నలిస్ట్ భారద్వాజ మాట్లాడుతూ ఆమెను మూడేళ్లు అగ్రహీరోలు బ్యాన్ చేయడాని గల కారణాలను వివరించారు. ఏఎన్ఆర్ గారి తీరు నచ్చని జమున ఆవిడ ఎలా ఉంటారు ,ఏఎన్ఆర్ ఎలా నడుచుకుంటే తనకు బాగుంటుంది అనే విషయాలను మొహమాటం లేకుండా ఆయనకు చెప్పడంతో ఆవిడను పొగరుబోతుగా భావించిన ఆయన తన నిర్మాతలకు జమునను తరువాత తీయబోయే సినిమాలలో పెట్టుకోకూడదని చెప్పారట. అలాగే ఎన్టీఆర్ వద్దకు వెళ్లి ఆయనకు జమున గురించి చెప్పి ఆయన సినిమాల్లో కూడా నటించకుండా చేశారట.

అలా అగ్రహీరోలిద్దరూ మూడేళ్ళ పాటు వారి సినిమాల్లో జమునను నటించకుండా చేసినా ‘గుండమ్మ కథ’ సినిమా సమయంలో నాగిరెడ్డి చక్రపాణి గారు కల్పించుకుని ఇద్దరు అగ్రహీరోలకు క్లాస్ పీకి జమున గారిని నటింపజేశారు. అయితే ఆ సినిమా కంటే ముందే ఎన్టీఆర్ గారు ‘గులేభకావళి’ కథలోనూ జమున ను హీరోయిన్ గా తీసుకున్నారు, అది ఆయన సొంత చిత్రం. ఇక అలా మూడేళ్లు బ్యాన్ ఎదుర్కొన్న జమున ఆ సమయంలో కుర్ర హీరోలతో అలానే హిందీలోనూ నటించడం విశేషం.
































