Senior Journalist Bhardwaja : నయనతార పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టి నాలుగు నెలలయింది. తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ఏడేళ్లుగా ప్రేమించిన నయన్ చివరకు పెళ్లి బంధం తో ఒక్కటయ్యారు. వైభవంగా పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరూ పెళ్ళయ్యాక హనీ మూన్ అంటూ విదేశాలలో చక్కర్లు కొట్టారు. ఇక ప్రస్తుతం మళ్ళీ వారి వారి సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న ఈ ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యమంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. పెళ్ళైన నాలుగు నెలలకే పిల్లలను కనడమేంటి అనే సంశయం ఒక పక్క అయితే సరోగసి ద్వారా పిల్లల్ని కానాల్సిన పనేంటి నయనతార కు అంటూ వాదనలు బయలుదేరాయి.

అరేళ్ల క్రిమే పెళ్లయింది అంటూ కొత్త ట్విస్ట్…
సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన నయనతార, విగ్నేష్ శివన్ లు ఆ శుభవార్త తమ అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కానీ ఈ వార్త వివాదానికి దారితీసింది. పెళ్లి కాకుండా ముందే సరోగసి ద్వారా పిల్లలను ఎలా కంటారు, అసలు సరోగసి ఆశ్రయించాల్సిన అవసరం ఏమిటి అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇక తమిళ నాడు ప్రభుత్వం కూడా ఈ వివాదంలో వివరణ ఇవ్వాలని నయన్ దంపతులను అడిగారు. ఇక ఈ వివాదంలో ఇప్పుడు మరో కొత్త ట్విస్ట్ వచ్చింది. నయన్ విగ్నేష్ లు ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాం అన్నట్లుగా వార్త బయటికి వచ్చింది.

అపుడే పెళ్లి చేసుకుంటే మరి ఇపుడెందుకు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు, అయినా సరోగసి ఎందుకు అంటూ భిన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇక భరద్వాజ గారు మాట్లాడుతూ సరోగసినే తప్పు అన్నట్లు అందరూ మాటాడుతున్నారు, సరోగసి పద్ధతి లో పిల్లలను కనడం తప్పు కాదు కానీ ఆ పద్దతి అవాలంభించే ప్రాసెస్ లో తప్పులను చేస్తే అది శిక్షార్హం అవుతుంది. వీళ్ళు ఎందుకు సరోగసి ఆశ్రయించారో సరైన కారణం ప్రభుత్వానికి చెబితే సరిపోతుంది. కలిసి ఉండటం లేదా పెళ్లి చెసుకోవడం, పిల్లలను కనడం ఇవన్నీ వ్యక్తిగత స్వేచ్చ, వీటిపై ఇతరులు చెప్పింది చేయాలి అనడం తప్పు. చట్టానికి లోబడి సరోగసి ప్రాసెస్ జరిగితే అది సరైనదే అంటూ అభిప్రాయపడ్డారు.


































