Senior Journalist Bhardwaja : ఏపీ లో రాజకీయమంతా ఇన్ని రోజులూ పవన్ కళ్యాణ్ ప్రచారం వాహనం వారాహి మీదే నడిచింది. దాన్ని ఏపీ లో తిరగనివ్వం అంటూ వైసీపీ వాళ్ళు తెగ హడావిడి చేసారు. అసలు వాహనం మీద ఇంత రాద్ధాంతం ఎదుకు చేసారో వైసీపీ వాళ్లకే తెలియాలి. ఇక లేటెస్ట్ గా జనసేన నాయకుడు నాగబాబు మాట్లాడుతూ పవన్ మీద ఎన్ని ఆరోపణలు చేసినా వైసీపీ వాళ్ళు లాభపడేదేమి ఉండదు అంటూ పవన్ అనుకుంటే కేంద్రమంత్రి కాగలదు కానీ అలా చేయలేదు అంటూ నిప్పు రాజేశాడు. ఒక్కసారిగా గతాన్ని గుర్తుచేసాడు. ఇక ఈ కామెంట్స్ మీద సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడారు.

బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చిందా…
భరద్వాజ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు బీజేపీ కేంద్రంలో మంత్రి పదవి ఆఫర్ చేసినా ఆయన తిరస్కరించారు అనే రీతిలో నాగబాబు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కూడా అన్న చిరంజీవి లాగా పార్టీ స్థాపించి ఆ తరువాత వేరొక పార్టీలోకి విలీనం చేస్తారా అనే అనుమానాలు కొంతమందిలో మొదలయ్యాయి. పవన్ ఒక పార్టీ అధినేతగా పార్టీ బలోపేతం కోసం ఇన్నాళ్లు ఏమి చేసారో తెలియదు అంటూ భరద్వాజ గారు మాట్లాడారు. మొదటి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ తరువాత మద్దతు ఇచ్చినందుకు పార్టీ పైన విమర్శలు చేసి వామపక్షాలతో కలిసి పోటీ చేసి ఓటమి చూసారు.

ఇక ఇప్పుడు వామపక్షాలకు పూర్తి వైరుద్యంగా బీజేపీ తో జత కట్టారు. ఈ ఎన్నికల్లో ఇద్దరూ కలిసి పోటీచేస్తారనే సంకేతలు వస్తున్నాయి. అయితే గెలిచిన తరువాత పార్టీ ని బీజేపీ లో విలీనం చేస్తాడా అనే అనుమానాలు నాగబాబు కామెంట్స్ వల్ల వ్యక్తం అవుతున్నాయి. అలానే పవన్ కూడా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నా మరో వైపు పక్కన విన్నవి ప్రచారంలో ఉన్న మాటలను పట్టుకుని జగన్ ప్రభుత్వం పై విమర్శించడం వల్ల పలుచన అవుతారు. పార్టీ కోసం చాలా ఖర్చు పెడుతున్న పవన్ నిర్ధిష్టమైన ఆలోచనలతో ముందుకు వెళితేనే నిలదొక్కుకుంటాడు అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు.





























