Senior Journalist Bhardwaja : కరోనా తరువాత సినిమా పంథా మారిపోయింది. సినిమా చూసే ప్రేక్షకుడు స్టార్ హీరోనో లేక తాను అభిమానించే హీరోనో ఉంటే సినిమా చూడాలని అనుకోవడం లేదు. సినిమాలో కథ తనను ఆకర్షంచే పాయింట్స్ ఉంటేనే సినిమా చూస్తున్నాడు లేదంటే లేదు. సినిమా ప్రపంచవ్యాప్తం అయ్యాక సినిమాలో కంటెంట్ కోరుకుంటున్నాడు ప్రేక్షకుడు. అందుకే ఇప్పుడు ఏ సినిమా తీయాలన్నా కాంబినేషన్ కాదు, వర్క్ ఆయిట్ అవ్వాల్సింది కథ కంటెంట్. అది జనాలకి నచ్చేలా ఎలా చెప్పాలి అన్నదే ఇప్పుడు పరిష్కారం. ఇది ఒక చిన్న దర్శకుడుకే కాదు ఓటమి ఎరుగని దర్శకాదీరుడు రాజమౌళి లాంటి వాళ్లకు కత్తి మీద సాము లాంటిదే. ఇక రాజమౌళి లాంటి దర్శకుడిని కూడా బయపెడుతున్న అంశాలు ఏంటన్నది సీనియర్ సినిమా జర్నలిస్ట్ భరద్వాజ గారు విశ్లేషించారు.

ఆ విషయంలో రాజమౌళి భయపడుతున్నాడు…
భరద్వాజ గారు మాట్లాడుతూ విఎఫ్ఎక్స్ విజువల్స్ తో తీసిన సినిమాలంటే జనాలు ఆసక్తి చూపడం మెల్లగా తగ్గిస్తున్నారంటూ చెప్తున్నారు. జనాలకు గ్రాఫిక్స్ మీద మొహం మొత్తేసింది అంటూ మాట్లాడారు. ‘ఆదిపురుష్’ సినిమా టీజర్ వచ్చినపుడు జనాల రియాక్షన్ ఎలా ఉందో అందరం చూశామంటూ ఉదహరించారు. ఇక ‘కాంతార’ వంటి సినిమా 16 కోట్ల బడ్జెట్ తో తీసి దాదాపు 400 కోట్ల లాభలను రాబట్టుకోడానికి కారణం గురించి మాట్లాడుతూ కాంతార సినిమాలో గొప్ప కథ లేకపోయినా ప్రేక్షకులను కట్టి పడేసిన అంశం సహజత్వం. సినిమాలో గ్రాఫిక్స్ తక్కువగా ఉండి సినిమాలో ఒక లోకల్ కల్చర్ ను చూపించడం జనాలకు నచ్చింది. ఈ విషయమే ఇప్పుడు రాజమౌళి ని కలవపెడుతోంది. ఇప్పటివరకు రాజమౌళి సినిమాల్లో భారీతనం ఉంటాయి. కథ పెద్దగా లేకపోయినా గ్రాఫిక్స్ మాయాజాలం అలాగే ఒకటి రెండు సీన్స్ హైలైట్ గా చూపించి సినిమా చేసేవాడు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ విషయంలో అదే జరిగింది. ఇక ఈ సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో ప్రొజెక్ట్ చేయగలిగాడు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. జనాలు సినిమాలను కంటెంట్ ఉంటే తప్ప చూడాలనుకోవడం లేదు.

అందుకే రాజమౌళి కథ విషయంలో బాగా జాగ్రత్త తీసుకుంటున్నాడు. బాలీవుడ్ వాళ్ల విషయంలో అనురాగ్ కష్యప్ లాంటి డైరెక్టర్లు కూడా సౌత్ సినిమాలను చూసి గుడ్డిగా ఫాలో అవ్వకండి, మనకంటూ ఉన్న లెగసీని ఫాలో అవ్వండి అంటూ, తొందర పడొద్ధాంటూ సలహాలు ఇస్తున్నారు. సౌత్ సినిమాను చూసి వాత పెట్టుకుంటే బ్రహ్మాస్త్రా లాంటి ప్లాప్ చూడాల్సి వస్తుందంటూ చెబుతున్నారు. ఇక దీనిపై భరద్వాజ గారు మాట్లాడుతూ నిజానికి హిందూత్వ అజెండాతో సినిమా తీయకండి, కథ గురించి ఆలోచించమని బాలీవుడ్ వాళ్లకు అనురాగ్ సలహా. అది నిజమే, కథ చెప్పగలిగిన నేర్పరితనం ఉండాలి కానీ గ్రాఫిక్స్, డివోషనల్ క్యారెక్టర్స్ కాదు అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు.



























