Senior Journalist Bhardwaja : తెలుగులో హీరోయిన్ గా అగ్ర స్థానంలో ఉన్న సమంత నాగచైతన్య తో వివాహం జరిగి అక్కినేని కుటుంబానికి కోడలిగా వెళ్లినా కూడా సినిమాలను చేస్తూ తనని తాను ఛాలెంజింగ్ పాత్రలతో నిరూపించుకుంటూ ఉంది. అయితే కారణాలు ఏవైనా ఇద్దరూ విడిపోయారు. విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నా ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. విడాకుల తరువాత సమంత కెరీర్ స్లో అవుతుందని అనుకున్నా ఆమె మాత్రం రెట్టింపు స్పీడ్ తో దూసుకెళ్ళింది. ఒకవైపు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ మార్కెట్ పెంచుకుంది. ఇక అంతా బాగుందనుకునేలోపే సమంతకు ఆటో ఇమ్మ్యూన్ సమస్యతో బాధపడుతున్నట్లు స్వయంగా తానే ప్రకటించడం తో మయోసైటీస్ వ్యాధి గురించి అందరూ ఆరాలు తీయడం, ఎవరికి తోచింది వారు సోషల్ మీడియాలో పెట్టేయడం జరుగుతోంది. ఇక వీటన్నిటికీ క్లారిటీ ఇస్తూ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడారు.

నాగ చైతన్య అందుకే సైలెంట్ గా ఉన్నాడు…
భరద్వాజ గారు మాట్లాడుతూ సమంత సోషల్ మీడియా వేదిక ద్వారా తనకు ఉన్న వ్యాధి గురించి అందరికి చెప్పి త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తాను అంటూ పేర్కొంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆ వ్యాధి చాలా ప్రమాదకరం, ఆ వ్యాధి వల్ల అంగ వైకల్యం వస్తుంది అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక ఆమెకు ఈ వ్యాధి ఎలా వచ్చింది అనే అంశం మీద చాలా మంది మాట్లాడుతున్నారు. ఆమె ఫిట్ నెస్ కోసం ఎక్కువగా వ్యాయామలు చేయడం అలాగే ప్లాస్టిక్ సర్జరీ ల వల్ల ఈ వ్యాధి వచ్చిందంటూ చెబుతున్నారు. ఇందులో ఎంత నిజముందో తెలియకపోయినా ఇక మరో అడుగు ముందుకేసి నాగార్జున పరామర్శ కు వెళ్తున్నాడు కానీ నాగచైతన్య మౌనంగా ఉంటున్నాడు అంటూ కథనాలు అల్లేస్తునానరు, నిజానికి నాగార్జున వెళ్తున్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఇక నాగ చైతన్య విషయానికి వస్తే మొదటి నుండి విడాకుల ఇష్యూ అప్పటి నుండి తాను స్పందించడం లేదు. తనకు ఆ విషయాల మీద మాట్లాడటం ఇష్టం లేదు.

ఇక ఇప్పుడు ఖచ్చితంగా సమంత విషయంలో బాధ ఉంటుంది కానీ అది బయటికి చెబితే అందరూ వాటిలో కొత్త కోనాల్ని తీసుకుని ఏదేదో అల్లేస్తారనే భయంతో మౌనంగా ఉన్నాడు. ఇక వ్యాధి గురించి ముందే తెలిసీ అక్కినేని ఫ్యామిలీ సమంతను దూరం పెట్టింది అంటూ సోషల్ మీడియాలో కథలు అల్లేయడం గురించి భరద్వాజ గారు మాట్లాడారు. అందులో నిజం లేదని వారి విడాకుల తరువాత కూడా సమంత చాలా ఆరోగ్యంగా ఉంది, రెండు సినిమాలను చేసింది ఎక్కడా అనుమానం రాలేదు, అలాంటప్పుడు ఇలా మాట్లాడటం సబబు కాదు. ఏది ఏమైనా ఈ విషయంలో సమంత పూర్తిగా కోలుకొని బయటికివచ్చాక తానే స్వయంగా క్లారిటీ ఇస్తే అన్నీ తెలుస్తాయి అంటూ మాట్లాడారు.



























