Senior Journalist Bhardwaja : ఏపీ రాజకీయాల్లో టీడీపీ, వైసీపీ హోరా హోరీగా ఉంటే మరోవైపు జనసేన నేను ఉన్నా అంటూ గుర్తుచేస్తోంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు వ్యూహ రచన చేస్తూ ఎత్తులు వేస్తున్న సమయంలో టీడీపీ తరుపున ఎన్నికల ప్రచారానికి మరోసారి జూనియర్ ఎన్టీఆర్ వస్తాడంటూ నందమూరి తారక రత్న చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం రాజకీయాల గురించి ఆలోచించకుండా కేవలం తన సినిమాల గురించి మాత్రమే ఫోకస్ చేసిన ఎన్టీఆర్ మళ్ళీ టీడీపీ కోసం ప్రచారానికి వస్తాడా అనే అంశం మీద పొలిటికల్ చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ విషయం గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఆయన విశ్లేషణ అందించారు.

తెరపైకి ఎన్టీఆర్ పేరు… బాబు మాస్టర్ ప్లాన్ అదే…
ఇటీవల గుంటూరులో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణలో పాల్గొన్న నందమూరి తారక రత్న ఆసక్తికర వాఖ్యలు చేసారు. తమ్ముడు ఎన్టీఆర్ కూడా 2024 ఎన్నికల ప్రచారానికి వస్తాడంటూ చెప్పాడు. ఇక ఈ అంశం గురించి మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఎన్టీఆర్ రాజకీయాల వైపు చూడాలని అనుకోవడం లేదంటూ కామెంట్స్ చేసారు. ఇటీవల జరిగిన పరిణామాలు అందుకు ఎన్టీఆర్ స్పందించిన తీరు చూస్తే ఈ విషయం అర్థవుతుంది అంటూ తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుకు సంబంధించిన అంశం లో కూడా చాలా జాగ్రతగా ఎన్టీఆర్ స్పందించాడు. ఇక తారక రత్న సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా పెద్దగా సక్సెస్ కాలేదు. విలన్ గా మంచి పేరు తెచ్చుకున్నా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నాడు.

తాజాగా రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్లు అర్థమవుతుంది. అందుకే ఏపీ లో జరుగుతున్న సంఘటనలపై టీడీపీ మీద వైసీపీ చేస్తున్న దాడులపై ఆవేశంగా స్పందిస్తున్నాడు తారక రత్న. ఇటీవల గుంటూరు విగ్రహావిష్కరణ సందర్బంగా కూడా ఇలానే మాట్లాడారు. ఇక ఎన్టీఆర్ ను కలుపుకునే ప్రయత్నం చేసాడు అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కలిశారు. ఒకవేళ చంద్ర బాబు కలవాలనుకున్నా వెళ్లి ఎన్టీఆర్ కలుస్తాడు కానీ రాజకీయాలకు దూరంగానే ఉంటాడు. ఏదో మ్యాజిక్ జరిగితే తప్ప 2024 ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాడు అంటూ క్లారిటీ ఇచ్చారు భరద్వాజ.





























