Senior Journalist Bhardwaja : మంచు విష్ణు బాగా గ్యాప్ తీసుకుని మళ్ళీ కామెడీ ఎంటర్టైనర్ ను నమ్ముకుని బరిలోకి వచ్చారు. దేనికైనా రెడీ సినిమా దర్శకుడు శివ నాగేశ్వరావు డైరెక్టర్ లో ‘జిన్నా’ సినిమా చేసారు మంచు విష్ణు. ఆయనకు జోడిగా సన్నీలియోన్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించారు. ఇక సినిమా మీద పెద్దగా అంచనాలు లేకపోయినా మంచు ఫ్యామిలీ బాగా ఆశలు పెట్టుకుంది. మోహన్ బాబు నిర్మాతగా మాత్రమే కాకుండా స్క్రీన్ ప్లే విషయంలో కూడా సలహాలు ఇచ్చారట. మా అధ్యక్షుడు అయిన తరువాత వచ్చిన ఈ సినిమా మీద విష్ణు కి చాలా ఆశలే ఉన్నాయి. అయితే సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తున్న థియేటర్ కి మాత్రం జనాలు రాకపోవడం విచిత్రం. ఇక ఈ విషయాల మీద సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు తనదైన శైలిలో విశ్లేషించారు.

ప్రేక్షకులు మంచు ఫ్యామిలీకి షాక్ ఇచ్చారు…
సినిమా బాగుందనే టాక్ వచ్చినా సినిమాకు ఎవరూ వెళ్లడం లేదు, వసూళ్లు మొదటి రోజు కేవలం పది లక్షలు. ఇక దీపావళి సెలవులు కాబట్టి ఆ మాత్రం థియేటర్ నిండింది, ఇక సెలవులు అయిపోతే పరిస్థితి వేరేలా ఉంటుంది, ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. సినిమాలో ఏదో గొప్ప విషయం, కాంట్రావెర్సీ, లేక విజువల్ వండర్ గా ఉంటే తప్పితే సినిమాను చూడాలని జనాలు థియేటర్ కి వెళ్లడం లేదు. అలా కాకుండా రొటీన్ సినిమా అయితే బాగున్నా ఓటీటీ లో వచ్చే వరకు వేచి చూస్తున్నారు.

ఇక సినిమా బాగున్నా టికెట్స్ రేట్స్ వల్ల ప్రేక్షకులు థియేటర్ కి దూరం అవుతున్నారు. కేవలం ఇపుడే ఆ సినిమా చూడాలి, అది థియేటర్ లో చూడాల్సిన సినిమా అనే భావన కలిగితేనే అటువంటి సినిమాలకు మాత్రమే వెళుతున్నారు జనాలు. అలా జనాలు ఈ మధ్య కాలంలో వెళ్ళింది ‘కాంతార’ సినిమా కోసం. ఇక జిన్నా లాంటి సినిమా బాగున్నా ఓటీటీలో వచ్చాక చూసుకోవచ్చు అనుకుంటున్నారు. మంచు విష్ణు తన సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ కి వస్తున్న కలెక్షన్స్ ని ఒకసారి పరిశీలించి ఎలాగూ ఆయన మా అధ్యక్షుడు కాబట్టి థియేటర్ల విషయంలో చర్యలు తీసుకుంటే బాగుంటుంది.































