Senior Journalist Bhardwaja : ప్రస్తుతం సౌత్ ని ఉపేస్తున్న సినిమా కాంతార. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు ఏ మాత్రం ప్రచారం లేకుండా 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు వసూళ్లలో కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ లను మించి పోయింది. ఐఏండిబి రేటింగ్స్ లో కూడా ఈ రెండు సినిమాలను దాటేసింది. కన్నడ చిత్రమైనా ఇతర భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ తో పెద్ద సినిమాలను కుడా పక్కకు నెట్టి దూసుకుపోతోంది ఈ సినిమా. కాంతార సినిమాను రిషబ్ శెట్టి తన సొంతూరు లో జరిగిన యధార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో హీరో కూడా రిషబ్ శెట్టి నే, ఆత్మలతో మాట్లాడే వారి తెగ గురించి ప్రపంచానికి ఈ సినిమా ద్వారా పరిచయం చేసాడు రిషబ్ శెట్టి. కేజీఎఫ్ సినిమా నిర్మించిన హోంబలే సంస్థ తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కూడా దూసుకుపోతోంది.

మెగాస్టార్ కి షాక్ ఇచ్చిన కాంతార…
గాడ్ ఫాదర్ సినిమా విడుదల అయి ఓ మోస్తారు వసూళ్లతో పోతున్న సమయంలో కాంతార సినిమా వచ్చి గాడ్ ఫాదర్ సినిమా మీద దెబ్బ కొట్టింది. ఇక ఈ ఇష్యూ మీద సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మాట్లాడుతూ నేటివిటీ మీద వచ్చిన కాంతార సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చింది. సినిమాను అల్లు అరవింద్ కేవలం రెండు కోట్లకు కొన్నారు. కానీ మొదటి రోజే దాదాపు కోటి రూపాయలు వచ్చేసింది. ఇక రోజు రోజుకీ సినిమాకు ఆదరణ పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. పెట్టిన డబ్బుకి రెట్టింపు అల్లు అరవింద్ కి వచ్చింది. అదే సమయంలో గాడ్ ఫాదర్ వసూళ్లు తగ్గిపోవడంతో లాస్ వచ్చింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి గాడ్ ఫాదర్ సినిమాకు పెట్టిన బడ్జెట్ లో సగం చిరంజీవి రెమ్యూనరేషన్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఇంతకు మించి సినిమాలో పెద్ద ఖర్చు ఎక్కడా కనిపించడం లేదు, నటీ నటుల రెమ్యూనరేషన్ల మినహాయించి సినిమాకు పెట్టిన ఖర్చు తక్కువే కానీ ఈ కాస్ట్ పెరగడం వల్ల అది రాబట్టుకోడానికి ఇప్పుడు కష్టపడుతున్నారు. కంటెంట్ బాగుంటే ఎలాంటి చిత్రమైనా ప్రేక్షకులు అభిమానిస్తారు కేజీఎఫ్, కాంతార అందుకు ఉదాహరణలు. తెలుగులో మన దర్శకులు ఇప్పటికైనా నేటివిటీ, మన సంస్కృతి మీద దృష్టి పెట్టి సినిమాలను తీస్తే బాగుంటుంది, ఖచ్చితంగా హిట్ అవుతాయి. రాజమౌళి లాంటి దర్శకులు నేటివిటీ వదిలేసి కేవలం గ్రాఫిక్స్ మీద ఆధారపడి హాలీవుడ్ స్టైల్ లో సినిమాను భారీ బడ్జెట్ తో తీస్తాడు, బడ్జెట్ రాజమౌళి కి పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేటివిటీ మీద మన జానపదాల మీద సినిమాలను తక్కువ బడ్జెట్ తో సినిమా తీస్తే ఖచ్చితంగా అది హిట్ అవుతుంది అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు.































