Senior journalist Bhardwaja : హీరో నందమూరి బాలకృష్ణ 2004 జూన్ లో జరిగిన కాల్పుల సంఘటన ఒక్కసారిగా ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది. బాలకృష్ణ తన ఇంట్లో బెల్లం కొండ సురేష్, జోతిష్యుడు సత్యనారాయణతో భేటీ అయి ఆ తరువాత 6 రౌండ్ల కాపులు వారిద్దరి మీద జరిపారు. అయితే ఈ విషయంలో ఎవరు వాళ్ళ మీద కాల్పులు జరిపారో సాక్ష్యం లేకపోవడం వల్ల కేసును కోర్టు కొట్టేసింది. ఇక ఈ ఇష్యూ పాతదే అయినా సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు అసలుపుడు జరిగిన నాటకీయ పరిణామాలను వివరించారు.

బెల్లంకొండ చెప్పిన సాక్ష్యం కీలకం…
కాల్పుల సంఘటన జరిగిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేయడం ఆ తరువాత బాలకృష్ణ ను అరెస్ట్ చేసి జైలుకు రిమాండ్ కు తరలించాలని అనుకుంటే ఆయన జైల్లో అడుగుపెట్టనని చెప్పడంతో అక్కడి నుండి హాస్పిటల్ కి ఆరోగ్యం బాగోలేదంటూ తరలించారట పోలీసులు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో లేకపోవడం గమ్మతైన విషయం. ఇక కోర్ట్ లో బెల్లంకొండ సురేష్ సాక్ష్యం కీలకంగా మారగా మేము ముగ్గురం కూర్చొని మాట్లాడుతుండగా కాల్పులు జరిగాయి అది ఎవరో నాకు తెలియదు నేనంటే గిట్టని వాళ్ళు ఆ పని చేసుండొచ్చు అంటూ చెప్పి కేసు మలుపు తిప్పాడు. ఇక ఇంట్లో రక్తపు మారకలను కూడా వసుంధర గారు శుభ్రం చేయించడంతో అది సాక్ష్యాలను ప్రభావితం చేస్తుందని ఆమె మీద కేసు ఫైల్ అయింది.

అయితే బెల్లంకొండ సురేష్ చెప్పిన సాక్ష్యం వల్ల కేసు మలుపు తిరిగి కాల్చిన వ్యక్తి ఎవరన్న సరైన సాక్ష్యం కోర్ట్ కి దొరకపోవడం వల్ల కేసు కొట్టేసారు అంటూ భరద్వాజ గారు అప్పటి విషయాలను వివరించారు. ఇక ఇండస్ట్రీ మొత్తం బాలకృష్ణ కోసం వచ్చారు. చిరంజీవి, అల్లు అరవింద్ బాలకృష్ణ హాస్పిటల్ లో ఉంటే దాదాపు 8 గంటలు ఉన్నారు. ఇక రామానాయుడు గారు బెల్లంకొండ సురేష్ కు ఏకంగా నా కొడుకు రెండు సినిమాలు నీకు రెమ్యూనరేషన్ తీసుకోకుండా చేస్తాడంటూ ఆఫర్ కూడా ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీ మొత్తం బాలకృష్ణ సమస్య గా చూడలేదు కేవలం రామారావు కొడుకు జైలు కి వెళ్ళారాదనే చూసారు అంటూ చెప్పారు భరద్వాజ గారు.































