Senior Journalist Imandhi Ramarao : ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్షాల మీద హద్ధులు దాటి విరుచుకుపడే నేతలలో మంత్రి రోజా, కోడాలి నానీ, ప్రేర్ని నానీ, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు వంటివారు ముందుంటారు. విపక్షాల మీద దాడి విషయంలో వీరికి ఎవరు సాటిరారు. తాజాగా జరిగిన అమరావతి పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం గురించి ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ టీడీపీ గెలిచిన ఒకదానికే వరల్డ్ కప్ కొట్టినట్లు ఫీల్ అవుతున్నారంటు కామెంట్స్ చేసారు. ఇలా ఎప్పటికప్పుడు విపక్షాల మీద విరుచుకుపడుతున్న, ఇక వైసీపీ మహిళ నేతలలో రోజా ముందుంటారు. ఇక ఆమె జనసేన అధినేత మీద విరుచుకుపడే విధానం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామరావు మాట్లాడారు.

నాగబాబు తో అన్నేళ్లు కలిసి పనిచేసావ్ మరచిపోయావా…
ఇమంది రామారావు గారు మంత్రి రోజా తీరు గురించి మాట్లాడుతూ ఆమె జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే అయన కుటుంబం గురించి కూడ విమర్శలను చేస్తుంటారు. ఒకప్పుడు జబర్దస్త్ లో నాగబాబు తో కలిసి పనిచేసి అపుడు నాగబాబు గారు అంటూ పిలిచిన రోజా ఇపుడు జనసేన పార్టిని విమర్శించడం కోసం ఏకవచనం తో మాట్లాడుతుంది.

ఇక చిరంజీవి గారింటికి వెళ్లి అతిద్యం తీసుకుంటుంది మళ్ళీ వారినే విమర్షిస్తుంది. ఆ విమర్శలకు కూడ స్థాయి అలాగే హద్దు ఉండాలి. అవేవి లేకుండా మాట్లాడేస్తుంది రోజా అంటూ ఫైర్ అయ్యారు ఇమంది రామారావు. జగన్ మెప్పు, ప్రాపకం కోసం హద్ధులు మీరు కామెంట్స్ చేస్తే భవిష్యత్ ఏమిటనేది రోజా ఆలోచించడం లేదంటూ ఆయన అభిప్రాయపడ్డారు.