Senior Journalist Imandhi Ramarao : అన్ స్టోపబల్ షో ఈ మధ్య రాజకీయ విమర్శలకు కేర్ అఫ్ గా మారిపోయింది. సీజన్ 2 మొదటి ఎపిసోడ్ కి నారా చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు లోకేష్ రావడంతో తెలుగు దేశం అజెండాతో ప్రోగ్రామ్ నడుస్తోందనే విమర్శలను వైసీపీ పార్టీ అందుకుంది. ఇక లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ ఈ షోకి రావడంతో మరింత ఘాటు వాఖ్యలతో వైసీపీ నేతలు దాడి చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి రోజా పవన్ కళ్యాణ్ ను విమర్శించడం అనే బాధ్యతను తన నెత్తిన వేసుకుని మరీ విమర్శిస్తుండగా ఇప్పుడు ఈ షో గురించి మరింత ఘాటుగా విమర్శించింది. ప్రస్తుతం రోజా కామెంట్స్ బాగా వైరల్ అవుతుండగా వాటి గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడారు.

ఊరబిత్తిరి రోజా ఈసారి ఎన్నికల్లో అంతే…
బాలకృష్ణ, పవన్ కళ్యణ్ లను పెద్ధ బిత్తిరి చిన్న బిత్తిరి అంటూ రోజా చేసిన వాఖ్యలను గురించి మాట్లాడుతూ ఇమంది గారు రోజా ఒక ఊర బిత్తిరి లాగా తయారైంది అని జనాలు అనుకుంటున్నారు అంటూ అభిప్రాయాపడ్డారు. రోజా నోరు అదుపులో పెట్టుకోక పోతే మెగా ఫాన్స్ చేతిలో అయిపోతుంది అంటూ అభిప్రాయపడ్డారు.

ఇక అన్ స్టోపబుల్ షోకి బాలకృష్ణ నన్ను పిలిచాడని అసెంబ్లీ సమావేశాల తరువాత వెళ్ళాల్సి ఉండగా చంద్రబాబు, లోకేష్ వెళ్లడంతో నాకు పిచ్చెక్కింది వెళ్లాలని అనిపించలేదు అని రోజా చేసిన వాఖ్యలను ఉద్దేశిస్తూ ఇమంది గారు అన్ స్టోపబుల్ కి రోజా వస్తే ఎవరికి లాభం రాకపోతే ఎవరికి నష్టం అంటూ చెప్పారు. రోజా మరీ దిగజారి మాట్లాడుతోందని, టూరిజం మినిస్టర్ అయ్యుండి టూరిజం గురించి తెలియదు కానీ ఊరికే నోరు పారేసుకుంటుంది అంటూ విమర్శించారు. జగన్ వద్ద మెప్పుకోసం అలానే ఎమ్మెల్యే టికెట్ కోసం ఇంత దిగజారి మాట్లాడాల్సిన పనిలేదు అంటూ అభిప్రాయపడ్డారు.
































