Senior journalist Imandhi Ramarao : నవంబర్ 14 న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన కృష్ణగారికి చికిత్స అందించిన వైధ్యులు చికిత్సకు ఆయన శరీరం స్పందించకపోవడం వల్ల నవంబర్ 15 తెల్లవారుజామున ఆయన మరణించారు. ఇక ఆయన మరణాంతరం జరిగిన సంఘటనల గురించి చర్చ మొదలయింది. ముఖ్యంగా అన్నీ తానే అన్నట్లు నరేష్ ఉండటం ఇక నరేష్ తో పాటు పవిత్ర లోకేష్ అక్కడే ఉండటం కుటుంబ సభ్యురాలిలాగ అన్ని విషయాలను చూసుకోవడం వంటివి చాలా మందికి నచ్చక ఆమెను సోషల్ మీడియా వేదికగా తప్పుబడుతున్నారు. ఇదిలా ఉంటే కృష్ణ గారి ఆస్థికలను ఆయన తనయుడు మహేష్ బాబు విజయవాడ కృష్ణా నదిలో కలిపారు. ఇక కార్యకరమానికి నరేష్ హాజరుకాకపోవడంతో ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి. వీటి గురించి సీనియర్ సినిమా జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడారు.

అక్కడే నరేష్ వ్యవహారం కృష్ణ కుటుంబానికి నచ్చలేదు…
కృష్ణ గారి అంత్యక్రియల సమయంలో నరేష్, పవిత్ర లోకేష్ తో కలిసి ఉండటం, అన్నీ తానే అన్నట్లు అలాగే పవిత్ర లోకేష్ ఆ ఇంటి సభ్యురాలు అన్నట్లు ప్రవర్తించడం అక్కడ కృష్ణ కుటుంబానికి నచ్చలేదు. ఇక అంత్యక్రియలప్పుడు నరేష్ చేయడానికి రావడం, కృష్ణ కుటుంబం చేయనివ్వకపోవడంతో నరేష్ అలిగినట్లు తెలుస్తోంది అందుకే కృష్ణ గారి ఆస్థికలను కృష్ణా నదిలో కలిపినపుడు నరేష్ హాజరు కాలేదు.

కృష్ణ కుటుంబ సభ్యులు పిలిచినా నరేష్ అలిగి రాలేదు అంటూ ఇమంది గారు వివరించారు. కృష్ణ విజయనిర్మల ఉన్నంతవరకూ నరేష్ ఆ కుటుంబంతో సంబంధాలను కలిగి ఉంటాడు. ఇక వారే పోయాక ఇక కృష్ణ కుటుంబం సభ్యులకు నరేష్ కి ఏమీ సంబంధం లేదు అంటూ ఇమందిగారు అభిప్రాయపడ్డారు.



























