Senior Journalist imandhi Ramarao : సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించి ఇంకా వారమైనా గడవక ముందే అప్పుడే సోషల్ మీడియాలో ఆయన ఆస్తుల గురించి ఇవి ఎవరికి చెందుతాయి, నరేష్ కి వాటా ఉంటుందా అనే అంశాల మీద జోరుగా చర్చ నడుస్తోంది. ఇక కృష్ణ గారి డైరీలో అసలు ఏమి రాశారు, ఎవరికి ఆస్తి ఇచ్చారు అనే అంశాల మీద అనేక చర్చలు జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు ఈ విషయాల గురించి విశ్లేషించారు.

ఆస్తులు ఎవరి సొంతం…
కృష్ణ గారు సంపాదించిన ఆస్తి విషయంలో పెద్ద పీట పెద్ద కుమారుడు రమేష్ బాబుకే ఉంటుంది. ఆయన మరణించినా ఆయన వ్యాపారంలో సంపాదించినది, ఇక తన భార్య తరుపున వచ్చిన ఆస్తి చాలానే ఉన్నా కృష్ణ గారి పెద్దకుమారుడిగా సింహ భాగం ఆయనదే అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు. ఇక కూతుర్లలో మంజుల గారికి కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు. గల్లా జయదేవ్ భార్య, అలాగే సుధీర్ బాబు భార్య బాగున్నారు. ఆర్థికంగా ఆ కుటుంబాలు బాగున్నాయి.

కానీ మంజుల గారు సినిమాలను నిర్మించడం వల్ల కొంత నష్టపోయారు, అందుకే ఆమెను గురించి కృష్ణ అలోచించి ఉండవచ్చు అంటూ చెప్పారు. ఇక మహేష్ వాటా ఖచ్చితంగా మహేష్ కు ఉంటుంది అంటూ చెప్పారు. ఇక నరేష్ కి రక్త సంబంధం లేకపోయినా తన వెన్నంటే ఉన్నందున అందులోనూ విజయనిర్మల మీద ఉన్న ప్రేమతో నరేష్ కు కొంత ఆస్తి ఇవ్వచ్చు, అవకాశం ఉంది, వేల కోట్ల ఆస్తులు వారికి ఉన్నాయి కాబట్టి అందరికీ న్యాయం చేస్తారు అంటూ అభిప్రాయపడ్డారు.

































