Senior Journalist Imandhi Ramarao : నవంబర్ 15న ఆర్గాన్ ఫెయిల్యూర్ తో సూపర్ స్టార్ కృష్ణగారు మరణించారు. ఇక ఆయన అంతిమ యాత్ర, అంత్యక్రియలు జరిగిన తీరు ఎవరికీ నచ్చలేదు. అభిమానులు ఎంతో దూరం నుండి ఆయనను చూడటానికి వస్తే కనీసం చివరి చూపు దక్కకపోవడం, అదీకాక ఒక సాధారణ వ్యక్తికి జరిగినట్లు అంత్యక్రియలు మహా ప్రస్థానంలో జరగడం అభిమానులకు అగ్రహాన్ని తెప్పించాయి. నిర్వహణ లోపం, నిర్ణయాలు తీసుకోవడంలో మహేష్ అలాగే మిగతా కుటుంబ సభ్యులు విఫలం అయ్యారు అంటూ విమర్శలు వినిపించాయి. ఇక ఈ విషయాల మీద మాట్లాడుతూ మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు.

మహేష్ సహా ఎవరూ కృష్ణ గారిని పట్టించుకోలేదు…
కృష్ణ గారు చికిత్స కోసం హాస్పిటల్ వెళ్లగా అక్కడే మరణించారు. ఇక ఆయన మరణించాక పార్థివదేహం ఆయన నివాసానికి తీసుకురాగా అక్కడ కృష్ణ గారి కుటుంబ సభ్యులు మహేష్ తో సహా ఎవరూ లేరని ఆ రాత్రి ఎవరూ పట్టించుకోలేదని అక్కడి వారే అన్నారు అంటూ ఇమంది గారు చెప్పారు. ఇక ఆయన పార్థివ దేహం వద్ద నరేష్ పవిత్ర లోకేష్ తో ఉండటం ఇవన్నీ చూడటానికి బాగోలేవంటూ అభిప్రాయపడ్డారు.

అంతటి లెజెండ్రి హీరో చనిపోతే చూడటానికి ఎంతమంది వస్తారనే అంచనాలు మహేష్ కానీ వాళ్ళ బాబాయ్ ఆదిశేష గిరిరావు కానీ అంచనా వేయలేదు. ఒక నిర్ణయం తీసుకునే తెగువ మహేష్ కు లేదనే విషయం కృష్ణ గారి అంత్యక్రియల విషయంలోనే అర్థమైంది అంటూ అభిప్రాయపడ్డారు. మహేష్ ఆలోచించలేని పరిస్థితి లో ఉంటే కనీసం ఆయన భార్య నమ్రత, ఇక రమేష్ బాబు భార్య కూడా పట్టించుకోవాలి కదా, కూతుర్లు ఉన్నారు వాళ్ళైనా చూడాల్సింది. ఒక అల్లుడు పొలిటిషన్, ఇంకో అల్లుడు హీరో ఇంత మంది ఉండి కృష్ణ గారికి గౌరవప్రదమైన వీడ్కోలు పలకలేదు. ఇక బుర్రిపాలెం లో సంస్మరణ సభ పెట్టుంటే బాగుండేది అదీ చేయలేదు అంటూ ఇమంది గారు ఫైర్ అయ్యారు.



























