Senior Journalist imandhi Ramarao : తెలుగులో ఎంత మంది ప్రతిభ ఉండి హీరోలుగా మొదట్లో మంచి అవకాశాలతో దూసుకుపోయినా చివరికి చేజేతులా కెరీర్ ను నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ఈశ్వరరావు ఒకరు. ఆయన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తరువాత వరుస సినిమాలతో దూసుకుపోయినా తనపై తనకు నమ్మకం లేకపోవడం వల్ల కెరీర్ లో వెనుకబడిపోయాడు. ఇక ఆయన జీవిత విశేషాల గురించి సీనియర్ సినిమా జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడారు.

దాసరి వల్ల కెరీర్ పోయింది…
ఇమంది గారు ఈశ్వరరావు గురించి మాట్లాడుతూ ఆయన సంజీవ్ కుమార్ వంటి ఆర్టిస్ట్ అవ్వాలని అనుకుంటున్నానని నా ఇంటర్వ్యూలో చెప్పేవాడు అంటూ చెప్పారు. ఈశ్వర్ రావు గారి మొదటి సినిమా దాసరి గారి ‘స్వర్గం నరకం’. ఆ సినిమాలో మోహన్ బాబు తో పాటు మరో హీరోగా ఈశ్వరరావు గారు నటించారు. సినిమాలో ఆయన నటనకు మంచి పేరుతో మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది. ఆ సినిమా తరువాత వరుసగా ఒక పదిహేను సినిమాల్లో ఈశ్వరరావు గారు హీరోగా నటించారు.

అయితే ఆయనకు ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ ఉండటం వల్ల తాను సరిగా నటిస్తున్నానా లేదా అనే భయం ఎక్కువ ఉండేది, అదే ఆయన కెరీర్ ముందుకు సగకపోడానికి కారణం అంటూ చెప్పారు. ఇక ఆయన అతి మంచితనం వల్ల భయస్తుడు కావడం వల్ల సరైన అవకాశాలు అందుకోలేదు. దాసరి గారంటే విపరీతమైన భయం, గౌరవం ఉండేవి దానివల్ల ఆయన నుండి పక్కకు పోలేక పోయాడు అందుకే మరిన్ని అవకాశాలు అందుకోలేక పోయాడు అంటూ ఇమంది గారు ఈశ్వరరావు గురించి చెప్పారు. ఇక కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఆయన తరువాత సీరియల్స్ లో కూడా నటించారు.


































