Senior Journalist Imandhi Ramarao : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య వరుస పర్యటనలతో సభలలో పాల్గొంటున్నారు. తాజాగా పాల్గొన్న కర్నూల్ సభకు మంచి జానధారణ రావడం ఇక ఆ తరువాత ఆయన మిగిలిన పర్యటనలోనూ ఆయన సభలకు జనాలు భాగనే వస్తున్నారు. అయితే దీనికి కారణం జగన్ సర్కారు మీద వ్యతిరేకత లేక తెలుగుదేశం పార్టీ జనాలను డబ్బులిచ్చి సభలకు పిలుచుకుంటున్నారా అనే సందేహాలు బాగా వ్యక్తం అయిన నేపథ్యంలో ఇవే నా చివరి ఎన్నికలు అంటున్న చంద్రబాబు సభలకు గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు విశ్లేషించారు.

అందుకే సభలకు జనం వెళ్తున్నారు…
ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగినందుకు జగన్ కి ఓటసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేసినందుకు ఏమి జరుగుతోందో చూస్తున్నారు. జగన్ పాలనలో ఎవరు సంతృప్తిగా లేరు అందుకే మరోసారి టీడీపి వైపు చూస్తున్నారు. అనుభవం ఉన్న నేతను ఎంచుకోవడం మంచిదనే అభిప్రాయం మళ్ళీ వస్తోంది జనాల్లో అందుకే చంద్రబాబు సభలకు జనాలు వస్తున్నారు. కానీ ఇవే నా చివరి ఎన్నికలు ఈ సారి టీడీపీ రాకపోతే నేను అసెంబ్లీ లో అడుగుపెట్టను అంటూ చంద్రబాబు చేసిన వాఖ్యలను గురించి మాట్లాడుతూ ఇమంది గారు ఇలాంటి మాటలకు జనాలు నవ్వుతారు.

చివరి ఎన్నికలు ఒక్క ఛాన్స్ ఇవన్నీ కాదు ఎవరు వస్తే మంచిదో వారికి ఓట్లు వేస్తారు. చంద్రబాబు లాంటి నాయకుడు కూడా ఇలా లాస్ట్ ఛాన్స్ అంటే ఎలా ఆది తప్పు అంటూ అభిప్రాయపడ్డారు.ఈసారి జగన్ కి కష్టమే చంద్రబాబు, పవన్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు కలిసో పోటీ చేస్తే అంటూ జోష్యం చెప్పారు. అభివృద్ధి ఏంటి అన్నది అలాగే జగన్ గెలిస్తే ఏమవుతుందో ఇంతకుముందు చంద్రబాబు చెప్పాడు ప్రస్తుతం అదే జరుగుతోంది అనే అభిప్రాయానికి జనాలు వచ్చారు అంటూ ఇమందిగారు చెప్పారు.



























