Senior Journalist Imandhi Ramarao : కర్ణాటక బళ్లారి కి చెందిన అలనాటి హీరోయిన్ జయంతి అసలు పేరు కమల కుమారి. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం ఇలా అన్ని భాషల్లోనూ హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడలో అగ్ర హీరోయిన్ గా వెలుగొందిన జయంతి గారు తెలుగులో మొదటి సినిమా ‘భార్యభర్తలు’. ఈ సినిమా అంతగా గుర్తింపు ఇవ్వకపోయినా ఆ తరువాత వచ్చిన ‘జగదేక వీరుని కథ’ సినిమా వల్ల మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సినిమాల్లో ఎంతో పేరు తెచుకున్న జయంతి వ్యక్తిగత జీవితంలో మాత్రం అంత ఆనందంగా ఉండేది కాదు అంటూ సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు అభిప్రాయాపడ్డారు.

ఎన్టీఆర్ చాలా చిలిపి చేష్టలు చేసేవాడు… ప్రేమించినవాడు మోసం చేసాడు…
జయంతి పేకెటి శివరామ్ గారిని ప్రేమించి ఆయనకు ఆల్రడీ పెళ్లి అయినా అతనితో సహజీవనం కొంసాగించింది. ఇక వారికి ఒక బాబు కూడా పుట్టాక అతని హింస భరించలేక వదిలేసి మద్రాస్ నుండి బెంగళూరు వచ్చేసింది. బెంగళూరు వచ్చాక కన్నడ సినిమాలు ఎక్కువగా చేసిన జయంతి తెలుగు సినిమాలను తగ్గించింది. రంగనాథ్ హీరో గా వచ్చిన మొదటి సినిమా ‘చందన’ లో హీరోయిన్ గా చేసిన జయంతి ఆ సినిమాలో పరిచయమైన గిరిబాబు అనే వ్యక్తిని మరోసారి ప్రేమించింది.

కానీ అతను ఆమె డబ్బును వాడుకుని మోసం చేయడంతో ఇబ్బందులు పడ్డారు జయంతి. ఇక బెంగళూరు లో స్థిరపడిన జయంతి ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోలతో హీరోయిన్ గా నటించింది కానీ ఏఎన్ఆర్ తో మాత్రం హీరోయిన్ గా నటించలేదు. ఇక ఎన్టీఆర్ తో కొండవీటి సింహం లో నటించిన జయంతి ఆయన చిలిపి చేష్టలు చాలా చేస్తాడంటూ చెప్పిన మొదటి హీరోయిన్ అంటూ ఇమందిగారు జయంతి వ్యక్తిగత విషయాలను చెప్పారు.
































