Senior Journalist Imandhi Ramarao : బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఒరిజినల్స్ లో వస్తున్న అన్ స్టాపబుల్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలుసు. ఈ షో సీజన్ వన్ అయిపోయి సీజన్ 2 కూడా మొదయింది. సీజన్ 2 లో మొదటి ఎపిసోడే తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు ని ఆయన కొడుకు నారా లోకేష్ ని పిలిచి పొలిటికల్ హీట్ పెంచారు బాలయ్య. అన్ స్టాపబుల్ కొత్త ఎపిసోడ్ లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు అలాగే స్పీకర్ సురేష్ రెడ్డి సీనియర్ హీరోయిన్ రాధిక రానున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి, బాలకృష్ణ ముగ్గురు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు పైగా స్నేహితులు కావడంతో ఈ షో మరింత ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ఇక ఈ ప్రోమో లో రాధికా శరత్ కుమార్ సందడి చేసారు. ఇది ఎవరూ అసలు ఊహించలేదు. రాధిక బాలకృష్ణ తో హీరోయిన్ గా ఒక్క సినిమా చేయలేదు కానీ వీరిద్దరూ ఫ్రెండ్స్ అనే విషయం చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ఇక వీరిద్దరి గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడారు.

వాళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా రాకపోడానికి కారణం ఆ హీరోనే…
బాలకృష్ణ హీరోగా వచ్చేసరికి రాధిక అప్పటికే హీరోయిన్ గా చేస్తున్నారు. ఇక చిరంజీవి రాధిక అప్పట్లో హిట్ పెయిర్. ఇక బాలకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చాక ఎక్కువ సినిమాలను విజయశాంతి తో చేశారు. చిరంజీవి, బాలకృష్ణ ల మధ్య పోటీ కారణంగానే చిరంజీవి తో ఎక్కువ సినిమాలను చేస్తుంది రాధిక అని బాలకృష్ణ పెట్టుకోలేదు అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు. ఇక బాలకృష్ణ హీరోయిన్ల విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపేవాడు, గ్లామార్ గా కనిపించాలని అనుకునేవాడు అందుకే వాళ్లిద్దరూ కలిసి చేసుండక పోవచ్చు అంటూ చెప్పారు.

ఇక షో గురించి మాట్లాడుతూ బాలకృష్ణ, కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి, రాధిక ల ముచ్చట్లు చాలా బాగున్నాయని అభిప్రాయపడ్డారు. బాలకృష్ణ రాధికను ఇరుకున పెట్టే ప్రశ్నలు వేశారంటూ చెప్పారు. రాధిక ఆనగానే తెలుగు ప్రేక్షకులము చిరంజీవి హీరోయిన్ గా గుర్తొస్తుంది కాబట్టి ఆ విషయం గురించే ప్రశ్నించి ఎపిసోడ్ మీద ఇంట్రెస్ట్ పెంచేసాడు బాలయ్య అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు.

































