Senior Journalist Imandhi Ramarao : కృష్ణ గారు మరణించాక జరిగిన పరిణామాల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చర్చకు దారి తీసాయి. మొదట ఆయన చివరిచూపు అవకాశం అభిమానులకు కల్పించక పోవడం, ఆ తరువాత అంత్యక్రియలు మహా ప్రస్థానంలో జరగడం ఇవన్నీ కృష్ణ గారి అభిమానులకు నిరాశ మిగిల్చాయ్. ఇక కృష్ణ గారి అంత్యక్రియలప్పుడు నరేష్ ప్రవర్తించిన తీరు చాలా చర్చనీయాంశం అయింది. ఆయన పవిత్ర లోకేష్ ను వెంటబెట్టుకుని తిరిగడం, వాళ్లిద్దరి హావభావాలు చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక నరేష్ వల్లే మంచు విష్ణు బాగా ట్రోల్స్ కి గురాయ్యడు అంటూ సీనియర్ సినిమా జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు కామెంట్స్ చేశారు.

తల్లి చనిపోతే అలా ప్రవర్తించాడు…
ఇమంది గారు నరేష్ స్వభావం గురించి చెబుతూ మా అసోసియేషన్ లో కొత్త ప్రెసిడెంట్ తనకు అనుకూలంగా లేని వాడు వస్తే తాను చేసిన తప్పుల వల్ల ఐదు కోట్ల డబ్బులకు దాదాపు లెక్కలు చూపాల్సి వస్తుందని మంచు విష్ణు ని వాడుకుని ప్రెసిడెంట్ గా పోటీకి నిలబెట్టాడు అంటూ ఇమంది హాట్ కామెంట్స్ చేసారు. మంచు విష్ణు కి అంత వరకూ లేని నెగెటివిటీ, ట్రోల్స్ కి కారణం నరేష్ అంటూ తెలిపారు.

ఇక తల్లి విజయనిర్మల చనిపోయినపుడు పరామర్శించడానికి జగన్ వస్తే ఇంట్లో రాజశేఖర్ రెడ్డి ఉన్న ఫొటోలతో అలంకరించడం, చంద్రబాబు ఉన్నపుడు ఎన్టీఆర్, చంద్రబాబు ఉన్న ఫోటోలను అలంకరించడం వారికి వాటిని ప్రత్యేకంగా చూపించడం ఇలాంటివి చేసాడు. తల్లి చనిపోతే ఎవరైనా ఇలా ప్రవర్తిస్తారా.. ఇక కృష్ణ గారు మరణించినపుడూ ఇలానే చేసాడు. ఇక కెసిఆర్ వచ్చినపుడు మహేష్ తో మాట్లాడుతున్న సమయంలో మధ్యలో దూరడం, ఆయన చేయి చూపి ఆపు అనడం దీనికి సంబంధిచిన వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఆయన నటుడిగా మంచి ఆర్టిస్ట్ కానీ తన వ్యక్తిగత బిహేవియర్ వల్ల చులకన అవుతున్నాడు అంటూ నరేష్ గురించి అభిప్రాయపడ్డారు.

































