Senior Journalist Imandhi Ramarao : స్వయం కృషితో ఏ గాడ్ ఫాదర్ లేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ కొన్ని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న మెగా స్టార్ చిరంజీవి గారికి ఇండస్ట్రీ లో బయట ఎన్నో కోట్ల మంది అభిమానులు ఉండగా, ఇండస్ట్రీ లో కూడా ఆయన స్ఫూర్తి తో ఆడుట్టినవారు ఎందరో ఉన్నారు. ఇటీవలే చిరంజీవి గారి ఖ్యాతిని ఇనుమడింపజేసేలా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 53 వ ఎడిషన్ కు ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ గా అవార్డును చిరంజీవి గారికి ప్రధానం చేసారు. ఒక తెలుగు వాడికి ఈ అవార్డు రావడం ఎంతో సంతోషించదగ్గ విషయం. అయితే చాలా ఆశ్చర్యకరంగా సినిమా ఇండస్ట్రీ ఈ విషయంలో స్పందించలేదు, చిరంజీవి గారిని అభినందించలేదు ఇది అభిమానులను చాలా నిరాశకు గురిచేసింది. ఈ ఇష్యూ మీద సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు స్పందించారు.

ఇండస్ట్రీ ఒక లెజెండ్రి నటుడిని సన్మానించక పోవడం దురదృష్టం….
ఎన్నో అవరోదలను దాటుకుని ఒక శిఖరంల నేడు ఎదిగిన మెగాస్టార్ కు ఆయన ప్రతిభకు గుర్తుగా వచ్చింది పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్స్ అవార్డు. అయితే ఈ విషయంలో తెలుగు ఇండస్ట్రీ పట్టించుకోకపోవడం ఆయనకి సన్మానం చేయకపోవడం విస్మయానికి గురిచేస్తోంది అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు. ఎన్నో ఏళ్ళు గా సేవ కార్యక్రమాలతో ఎంతోమంది సహాయపడిన ఆయన కు ఈ అవార్డు ఒక గుర్తింపు. ఆయన అభిమానులు ఈ విషయంలో ఎంతో ఆనందంగా ఉన్నా టాలీవుడ్ పట్టించుకోక పోవడం నిరాశకు గురిచేస్తోంది అంటూ అభిప్రాయపడ్డారు.

వజ్రోత్సవ వేడుకల్లో లెజెండ్రి యాక్టర్ గా అవార్డు వచ్చినపుడు దానికి అర్హుడివి కాదు అన్న మాటలకు ఆయన మరో 25 ఏళ్లకు 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది ఇండస్ట్రీ అప్పటికి నేను ఈ అవార్డు కి అర్హుడైతేనె ఆ అవార్డు తీసుకుంటా అంటూ చిరు చెప్పడం జరిగింది. కానీ ఇంకా అందుకు సమయం ఉన్నా ఆలోపు ఇండియా లోనే లెజెండ్రీ వ్యక్తిగా ఆయనకు అవార్డు రావడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఎవరో గౌరవం ఇవ్వంత మాత్రాన చిరంజీవి గారి వెలుగు తగ్గిపోదని మరోసారి ఈ అవార్డు తో రుజువయింది. అయితే తెలుగు ఇండస్ట్రీ ఆ లివింగ్ లెజెండ్ ను గౌరవించుకోవడం టాలీవుడ్ కి గొప్పగా ఉంటుంది ఆయనకు కాదు అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు.



























