Senior Journalist Imandhi Ramarao : గత నాలుగు నెలలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ వరుసగా ప్రముఖులు మరణిస్తున్నారు. కృష్ణ గారి భార్య ఇందిరా గారు ఆ తరువాత రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు ఆ తరువాత సూపర్ స్టార్ కృష్ణ గారు మరణిస్తే అవి మర్చిపోయేలోపే కైకాల సత్యనారాయన గారు మరణించారు. ఇక ఆయన మరణం నుండి తేరుకునేలోపే చలపతిరావు గారు మరణించారు. ఈ మరణాలన్నీ ఇండస్ట్రీని దిగ్బ్రాంతికి గురి చెయ్యగా అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరూ కడసారి వారిని చూసేందుకు వచ్చి చివరిసారిగా వారిని చూసి వీడ్కోలు పలికారు. కానీ ఇండస్ట్రీలో ఎవరు మరణించినా అక్కినేని నాగార్జున గారు చివరి చూపుకు రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ఎందుకు ఆయన కడసారి చూపుకు రారు అనే అంశం మీద సీనియర్ జర్నలిస్ట్ ఇమంది గారు మాట్లాడారు.

నాగేశ్వరావు గారి నుండి ఆ అలవాటు…
అక్కినేని నాగేశ్వరావు గారు ఆయనకు ఎంతో ఇష్టమైన ఘంటసాల గారు, అరుద్ర గారు, సావిత్రి గారు మరణించినా వారిని కడసారి చూసేందుకు వెళ్ళలేదు. దీనికి కారణం ఆయన చాలా సున్నిత మనస్కుడవడం వల్ల వారిని అలా చూసి తట్టుకోలేను వారు తిరిగి రారు, నా హృదయం వారు లేని విషయాన్నీ తట్టుకోలేదు అని చెప్పేవారట.

ఇక నాగార్జున కూడా అలానే సున్నిత మనస్కుడు, అందుకే ఎవరు మరణించినా హీనంగా చూడటానికి వెళ్ళాడు. అన్ని కార్యక్రమాలు అయ్యాక వారి కుటుంబంను పరామర్శిస్తాడు అంటూ ఇమంది గారు నాగార్జున ఎందుకు మరణించన వారిని కడసారి చూసేందుకు వెళ్ళడో వివరించారు.



























