Senior Journalist Imandhi Ramarao : దగ్గుబాటి ఇంటి వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామా నాయుడు గారి అబ్బాయి వెంకటేష్ హీరోగా అగ్ర హీరోల్లో ఒకరిగా నిలిచి ఎక్కువగా కుటుంబ ప్రేక్షకులకు మహిళా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఒకవైపు కామెడీ చేస్తూనే మరోవైపు సెంటిమెంట్ ను పండిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు వెంకటేష్. అయితే ఆయన ఇన్నేళ్ల కెరీర్ లో ఒక్కసారి కూడా వెంకటేష్ మీద కాంట్రావెర్సీ లు రూమర్స్ లేకుండా ఫ్యామిలీ హీరోగా నిలిచిన వెంకటేష్ కెరీర్ గురించి సీనియర్ సినిమా జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడారు.

మొదట్లో అల్లరి వాడే… మధ్యలో సైలెంట్ అయిన వెంకీ…
వెంకటేష్ అమెరికాలో చదువుకుని ఇండియా తిరిగి వచ్చి మొదటగా ‘కలియుగ పాండవులు’ సినిమాల్లో హీరోగా చేసాడు. ఆ సినిమా సమయానికి వెంకటేష్ చాలా చలాకిగా అల్లరిగా ఉండేవాడు అంటూ ఇమంది గారు తెలిపారు. అయితే ఒక మూడు నాలుగు సినిమాల తరువాత వెంకీ బాగా సైలెంట్ అయిపోయాడంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు.

అంత వరకు రూమర్స్ కూడా ఉండేవి చిన్న చిన్నవి కానీ ఒక్కసారిగా వెంకీ సైలెంట్ అయ్యాడు అంటూ ఇమంది గారు తెలిపారు. ఆధ్యాత్మికత వైపు వెళ్లిపోయాడంటూ తెలిపారు. అలా స్పిరిచువల్ పర్సన్ అయ్యాక కుటుంబం, వృత్తి ధర్మం రెండింటినీ బాలెన్స్ చేస్తూ జీవిస్తున్నారంటూ చెప్పారు సినిమాల్లో కూడా వెంకీ చేసిన సినిమాలకు 85% సినిమాలు హిట్ అంటూ తెలిపారు. రమణ మహర్షి ప్రభావం వెంకటేష్ మీద అధికంగా ఉంది అంటూ తెలిపారు.































