Senior Journalist Vinayaka Rao : ప్రయోగత్మక చిత్రాలు అంటే పెట్టింది పేరు కృష్ణ గారు. టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ ఆయనే. ఒక మూసలో ఉన్న చిత్ర పరిశ్రమకు హాలీవుడ్ కలర్ అద్దినా, లేక 70 ఎంఎం అంటూ స్క్రీన్ మార్చినా, కలర్ సినిమా అంటూ తీసినా అవన్నీ కృష్ణ గారి కొత్త ఆలోచనలకు నాంది. రిస్క్ చేయడానికి ఏమాత్రం వెనుకాడని కృష్ణ గారు మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే స్పెషల్ సాంగ్ చేసి న్యూ ట్రెండ్ ను క్రియేట చేసారు. ఇక గూడాచారి, మోసగాళ్ళకు మోసగాడు అంటూ కౌ బాయ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించి ఆంధ్ర జేమ్స్ బాండ్ అయ్యారు. ఇక ఆయన నటించిన ‘దేవదాస్’ సినిమా ప్లాప్ అవ్వడానికి కారణాలను సీనియర్ జర్నలిస్ట్ వినాయక రావు అప్పటి విశేషాలను వివరించారు.

ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారిని మోసం చేశారు…
దసరా బుల్లోడు సినిమా నాగేశ్వరావు గారికి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చింది అని చెప్పొచ్చు. ఆ సినిమాతో మళ్ళీ మంచి హిట్ అందుకుని ఆ జోనర్ సినిమాలను చేస్తే మహిళా ప్రేక్షకులు ఆదరిస్తారని టాలీవుడ్ కి అర్థమైంది. ఇక కృష్ణ గారు అటువంటి మహిళా ప్రేక్షకధారణ పొందే సబ్జెక్టు సినిమా తీయాలని ఆలోచిస్తున్న సమయంలో ప్రభాకర్ రెడ్డి గారు పండంటి కాపురం సినిమా కథ చెప్పడం, అది పట్టాలెక్కించడం హిట్ కొట్టడం జరిగాయి. 12 లక్షల బడ్జెట్ తో కలర్ సినిమాగా తీసిన ఆ సినిమా మంచి హిట్ గా నిలబడింది. ఇక ఈ సినిమా అయ్యాక ఏఎన్ఆర్ గారి సినిమాల్లో ఎవర్ గ్రీన్ అయిన ‘దేవదాస్’ సినిమాను మళ్ళీ తీయాలని కృష్ణ గారు అనుకున్నారు. విజయనిర్మలకు ఆ సినిమా చేయాలని ఎప్పటినుండో ఉండటంతో ఆ సినిమాను కలర్ లో తీసి మళ్ళీ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని కృష్ణ గారు భావించారంటూ వినాయక్ రావు గారు వివరించారు. రమేష్ నాయుడు సంగీతం బాలు గానం సినిమాకు మంచి హైలైట్ గా నిలిచాయి.

ఇక సినిమా విడుదల అయి మంచి విజయం అందుకుంటుంది అనుకునే సమయంలో ఏఎన్ఆర్ గారు పాత దేవదాస్ సినిమాను రీ రిలీజ్ చేయించారు. రెండు సినిమాలో ఒకే రోజు విడుదల అవడంతో పాత దేవదాస్ సినిమా వైపు జనాలు మొగ్గుచూపారు. ఘంటసాల గారితో బాలుని పోల్చుకుని ఆ పాత సినిమానే ఆదరించారు. అలా కృష్ణగారి దేవదాస్ సినిమా ఫ్లాప్ అయింది. ఆ సినిమా వేరు ఈ సినిమా వేరు అందుకే పాత సినిమా విడుదల చేశామని ఏఎన్ఆర్ చెప్పినా కృష్ణగారికి దేవదాస్ వల్ల నష్టం వచ్చింది. కానీ ఆయన అవేమి పట్టించికోకుండా మళ్ళీ అలానే రిస్క్ చేసి సినిమాలను తీశారు అది ఆయన గొప్పతనం అంటూ వినాయక రావు గారు అభిప్రాయపడ్డారు.



























