Senior producer Chittibabu : తెలంగాణలో సమస్యలు లేవా… ఎందుకు నోరెత్తరు… ఏపీ అంటే అంత అలుసా…: సీనియర్ నిర్మాత చిట్టిబాబు

0
223

Senior producer Chittibabu : ఏపీ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సినిమాలకు రాజకీయాలకు మధ్య మాటల యుద్ధం బాగానే జరుగుతోంది. మొదటి నుండి సినిమా రంగాన్ని రాజకీయ రంగాన్ని వేరు చేయలేనంతగా కలిసిపోయి ఉన్నా ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల సినిమా ఇండస్ట్రీ రాజకీయాలతో నలుగుతోంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న రాజకీయాలు చాలావన్నట్లు మళ్ళీ రాజకీయాలలో కూడా ఇండస్ట్రీ నలుగుతోంది. ఇక వైసీపీ నాయకులు ఈ మధ్య కాలంలో టార్గెట్ పవన్ కళ్యాణ్ అన్నట్లుగా మెగా ఫ్యామిలీని హోల్సేల్ గా విమర్శిస్తున్నారు. అయితే తాజాగా ఈ మధ్య కాలంలో రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడని చిరంజీవి ప్రభుత్వంకు చురకలు వేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ ఇష్యూ గురించి సీనియర్ నిర్మాత చిట్టిబాబు మాట్లాడారు.

ప్రభుత్వాలకు హీరోల రెమ్యూనరేషన్స్ తో పనేంటి…

వాళ్తేరు వీరయ్య 200 డేస్ వేడుకలలో మాట్లాడిన చిరంజీవి గారు ప్రభుత్వాలకు హీరోల రెమ్యూనరేషన్స్ తో పనేంటి అంటూ మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి చేయాలి కానీ సినిమా ఇండస్ట్రీ గురించి ఎందుకు అన్న కోణంలో మాట్లాడటం గురించి చిట్టి బాబు మాట్లాడుతూ చిరంజీవి తాను వ్యక్తిగతంగా ఎదుర్కొన్న సమస్యను చెప్పారు. నిజానికి చిరంజీవి తరువాతి బ్యాచ్ హీరోలందరూ తమ వ్యక్తిగత విషయాలను ప్రేక్షకులకు సోషల్ మీడియా ద్వారా చెప్తున్నారు. ఒకప్పుడు హీరోల రెమ్యూనరేషన్స్ వంటివి పక్కన ఉన్న కో స్టార్స్ కి కూడా తెలియనిచ్చేవారు కాదు. ఇపుడు మెహర్బాని కోసం చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకోవడం ఎందుకు, విమర్శించాక బాధపడటం ఎందుకు. వైసీపీ ఎలాంటి పార్టీనో తెలుసు, వాళ్ళు ఎలా విమర్శిస్తారో తెలిసి కూడా వారితో పెట్టుట్టుకోవడం ఎందుకు అంటూ చిట్టిబాబు అభిప్రాయపడ్డారు.

ఇక సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని కామెంట్స్ చేస్తారు అదే తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక మాట కూడా అనలేరు. జగన్ వద్దకు వెళ్ళినపుడు చిరంజీవికి గౌరవం ఇవ్వలేదంటూ పవన్ విమర్శించారు. కానీ చిరంజీవి ఎందుకు వెళ్ళాడు, తన సినిమా కోసం వెళ్ళాడు. మహేష్, ప్రభాస్ వీళ్లంతా కూడా వారి సినిమాల కోసం వెళ్లారు. ఆర్ నారాయణ మూర్తి వంటి వారు మాత్రమే చిన్న సినిమాల కోసం వెళ్లారు. అయినా సినిమా గురించి మీకెందుకు అని రాజకీయ నాయకులను అనే ముందు వాళ్ళు రాజకీయాలు మీకెందుకు అంటే ఏమి సమాధానం చెప్తారు అంటూ చిట్టిబాబు అభిప్రాయపడ్డారు.